• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /'నా భార్యను చంపలేదు.. మృతదేహాన్ని ముక్కలుగా చేశా..!' కోర్టులో వ్యక్తి సంచలన వాంగ్మూలం

'నా భార్యను చంపలేదు.. మృతదేహాన్ని ముక్కలుగా చేశా..!' కోర్టులో వ్యక్తి సంచలన వాంగ్మూలం

US Crime News: అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి నరేష్ భట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భార్య మరణానికి తాను కారణం కాదని.. ఆమె ఆత్మహత్య చేసుకుందని కోర్టుకు తెలిపాడు. ఆమె మరణించిన తరువాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు చెప్పాడు.

Written ByAshok Krindinti
Published: Nov 06, 2026, 01:29 PM IST|Updated: Nov 06, 2026, 01:32 PM IST
joinshare
'నా భార్యను చంపలేదు.. మృతదేహాన్ని ముక్కలుగా చేశా..!' కోర్టులో వ్యక్తి సంచలన వాంగ్మూలం
Image Credit: US Crime News (Source: Facebook)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు

Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు

2

Anand Mahindra: రాప్తాడు బాలిక లక్ష్మికి ఆనంద్ మహీంద్రా అండ.. చదువు ఖర్చులన్నీ భరిస్తానని హామీ..

3

Motorola నుంచి పవర్‌ఫుల్ ఫోన్‌.. Snapdragon 8 Gen 5, 12GB ర్యామ్‌తో Moto One లాంచ్!

4

'నా భార్యను చంపలేదు.. మృతదేహాన్ని ముక్కలుగా చేశా..!' కోర్టులో వ్యక్తి సంచలన వాంగ్మూలం

5

Renu Desai: నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది..?.. పవన్ కళ్యాణ్‌తో విడాకులపై రేణుదేశాయ్‌ సెన్సెషనల్ కామెంట్స్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

US Crime News: అమెరికాలో భారత సంతతికి చెందిన నరేష్ భట్ కేసు మరోసారి సంచలనంగా మారింది. తన భార్య మమతా కాఫ్లే భట్ ఆత్మహత్య చేసుకుందని.. ఆమె మరణించిన తర్వాత తాను మృతదేహాన్ని ముక్కలుగా చేసి చెత్తబుట్టలో పడేసేందుకు ప్రయత్నించానని నరేష్ కోర్టుకు చెప్పాడు. తాను ఇంటికి వెళ్లేలోపు రూమ్‌లో మంచం పక్కన నేలపై తన భార్య మమత అపస్మారక స్థితిలో పడి ఉందని.. ఆమె మాత్రలు, అత్యంత విషపూరితమైన పురుగుల మందును తాగిన తర్వాత ఆమె శరీరం చుట్టూ వాంతి ఉందని కోర్టుకు తెలిపాడు. మరోవైపు భార్యను హత్య చేసి.. ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించాడన్నది ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ఈ కేసులో తాజాగా నరేష్ ఇచ్చిన వాంగ్మూలం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు వివరాలు ఇలా..

నరేష్ భట్, మమతా కాఫ్లే భట్ దంపతులు. వీరు అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం మనస్సాస్ పార్క్‌లో నివసించేవారు. మమత అక్కడ నర్సుగా పనిచేసేది. 2024 జూలై 30న తెల్లవారుజామున తన భార్య బెడ్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో కనిపించిందని నరేష్ కోర్టులో చెప్పాడు. ఆమె చుట్టూ వాంతులు ఉన్నాయని, వాటిలో రక్తం, ఆహార పదార్థాలు, ట్యాబ్లెట్స్‌ క్యాప్సూల్స్ కనిపించాయని వివరించాడు. ఆమె దగ్గరే విషపూరితమైన సెల్ఫోస్ పురుగుల మందు ప్యాకెట్ కూడా తెరిచి ఉందన్నాడు. తాను చూసిన వెంటనే ఆమెను బతికించేందుకు దాదాపు గంటపాటు సీపీఆర్ సహా వివిధ ప్రయత్నాలు చేశానని తెలిపాడు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయిందని భావించినట్లు చెప్పాడు. ఆ సమయంలో పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించగా.. భయాందోళనకు గురయ్యానని సమాధానమిచ్చాడు.

మృతదేహాన్ని ముక్కలుగా చేసి..

భార్య మరణించిన తర్వాత ఏం చేయాలో తెలియక మొదట ఆమె మృతదేహాన్ని పోటోమాక్ నదిలో పడేయాలని భావించినట్లు నరేష్ కోర్టులో చెప్పాడు. ఇందుకోసం అవసరమైన వస్తువుల కోసం దుకాణాలకు కూడా వెళ్లినట్లు వివరించాడు. అనంతరం మృతదేహాన్ని చెత్త బుట్టలో వేయాలని ప్రయత్నించగా.. అది అందులో పట్టలేదని తెలిపాడు. దీంతో రంపం, కత్తుల సాయంతో మృతదేహాన్ని ముక్కలుగా చేయాలని ప్రయత్నించినట్లు అంగీకరించాడు. అయితే ముందుగా తాను ఆ పని పూర్తి చేయలేకపోయానని కోర్టులో చెప్పాడు. తరువాతి రోజు కూడా ఈ ప్రయత్నం కొనసాగించి మృతదేహాన్ని చెత్త సంచుల్లో ఉంచి డస్ట్‌బిన్‌లో పడేసినట్లు తన వాంగ్మూలంలో వివరించాడు.

మరోవైపు నరేష్ తన భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని మాయం చేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ఇంట్లోని బెడ్‌రూమ్, బాత్రూమ్‌లలో రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా ఓ రంపంపై లభించిన రక్తం.. మమత రక్తం అయి ఉండే అవకాశం ఉందని ఫోరెన్సిక్ నిపుణులు కోర్టులో వెల్లడించారు. మమత కనిపించకుండా పోయిన తర్వాత ఆమెను వెతికేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నించారు. అయితే ఇప్పటివరకు ఆమె మృతదేహం లభించలేదు. ఈ కేసులో నరేష్‌పై హత్య, మృతదేహాన్ని దాచడం, దానికి అవమానం కలిగించడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. తాను నిర్దోషినని.. హత్య చేయలేదని నరేష్ వాదిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
World News
Telugu News