EPFO Minimum Pension Hike: దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఈపీఎఫ్‌ఓ పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగుల ఎదురుచూపులకు త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఈపీఎస్ కనీస పెన్షన్‌ను త్వరలోనే పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
EPFO Minimum Pension Hike: ఎన్నో రోజులుగా రిటైర్డ్ ఉద్యోగులు, ఈపీఎఫ్‌ఓ పెన్షనర్లు చేస్తున్న డిమాండ్ త్వరలోనే నెరవేరే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే భారీ శుభవార్త అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద అందుతున్న కనీస నెలవారీ పెన్షన్‌ను ఏకంగా 7.5 రెట్లు పెంచే దిశగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. వివరాలు ఇలా..
1/5
PF Balance
కనీస నెలసరి పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచే అవకాశం ఉందని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 240వ సమావేశం గుజరాత్‌లోని గిర్‌లో నవంబర్ 19న జరగనుంది. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస నెలసరి పెన్షన్‌ను పెంచే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని తెలిపింది.
2/5
PF Minimum Pension Updates
2014 సెప్టెంబర్ నుంచి కనీస పెన్షన్ రూ.1000 అమలు అవుతోంది. అయితే గత దశాబ్ద కాలంలో దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. కానీ పెన్షన్ మాత్రం రూ.1000 వద్దే ఆగిపోయింది. పెరిగిన నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చులు, ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే నెలకు రూ.1,000 ఏమాత్రమూ సరిపోవడం లేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
3/5
EPFO News
30 ఏళ్లపాటు సర్వీసు అందించిన ఉద్యోగులకు కూడా పెన్షన్ రూ.1,171 మాత్రమే అందుతోందని.. పెన్షన్ పెంచాలంటూ జాతీయ ఆందోళన కమిటీ (NAC) వంటి సంస్థలు, కార్మిక సంఘాలు చాలా ఏళ్లుగా పోరాడుతున్నాయి.
4/5
PF Pension
ఈసారి కనీస పెన్షన్ పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల EPFO పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు తప్పనిసరి జీతం పరిమితిని నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది.
5/5
EPFO Minimum Pension Hike
పెన్షన్ పెంపుపై కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా స్పందించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిబంధనలను సమీక్షిస్తోందని.. పింఛన్ల పెంపు డిమాండ్‌పై సానుకూల వైఖరి తీసుకుంటోందని చెప్పారు. పెన్షన్ పెంపుతోపాటు యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా ఆప్షన్ ప్రారంభించే తేదీని ప్రకటించే అవకాశం ఉంది.