• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తురాలి భారీ విరాళం! చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తురాలి భారీ విరాళం! చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Written ByRenuka Godugu
Published: Oct 08, 2026, 15:15 IST|Updated: Oct 08, 2026, 15:19 IST
joinshare

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 78,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకోవడంతో రూ.4.35 కోట్ల ఆదాయం లభించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు శ్రీవారికి ఒక అరుదైన కానుకను అందజేశారు. దీని విలువ రూ.25 లక్షలు, ఆ పూర్తి వివరాలను తెలుసుకుందాం.
 

Coral Necklaces1/5

పగడాల హారం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారి దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తూ, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, శ్రీవారికి ఒక అరుదైన కానుక లభించింది. హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు రూ.25 లక్షల విలువైన పగడాల హారాన్ని విరాళంగా సమర్పించారు.
Tirumala devotee2/5

తిరుమల భక్తులరాలు

తిరుమల ఆలయానికి భక్తులు ఎప్పుడూ విశేషమైన విరాళాలు ఇస్తూనే ఉంటారు. ఈరోజు గురువారం, హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి కమల అనే భక్తురాలు శ్రీవారికి రూ.25 లక్షల విలువ చేసే రెండు బంగారు పగడాల హారాలను తన కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు కమిషనర్ వద్ద ఆ హారాలను అందజేశారు.
Tirumala Tirupati Devasthanam3/5

తిరుమల తిరుపతి దేవస్థానం

అదేవిధంగా, హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడైన మారుతి శేషతల్ప సాయి కూడా శ్రీవారి ట్రస్టుకు రూ.పదిలక్షల 116 రూపాయల విరాళం ఇచ్చారు. అలాగే నల్లపాటి గిరిధర్ అనే భక్తుడు కూడా రూ.10 లక్షల 116 రూపాయల విరాళాన్ని అందించారు.
Tirumala4/5

తిరుమల

దాతలు అందించిన ఈ విరాళాలను శ్రీవారి ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు కమిషనర్ శ్రీ సి.హెచ్. వెంకయ్య అందుకున్నారు. మరోవైపు, తిరుమలకు భక్తుల రాక కూడా పెరుగుతోంది.
TTD5/5

టీటీడీ

నిన్న 7వ తేదీ ఉదయం 10 గంటల సమయానికి నవరాత్రుల కోసం రూ.300 టికెట్లను కూడా జారీ చేశారు. ఈ సమయంలో కొన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. నిన్న ఒక్కరోజే తిరుమలకు 78 వేల మందికి పైగా భక్తులు రాగా, వారిలో 28 వేలకు పైగా మంది తలనీలాలు సమర్పించగా, మొత్తం రూ. 4.35 కోట్ల ఆదాయం లభించింది.
TAGS:
Tirumala

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.