హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్-2 లో జరుగుతున్న మరమ్మతుల వల్ల అక్టోబర్ 5వ తేదీ నుండి 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఏయే ప్రాంతాలపై దీని ప్రభావం ఉంటుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1/5
హైదరాబాద్ వాటర్ బంద్
ఎండాకాలం ముగిసినప్పటికీ, ఎండల తీవ్రత కారణంగా ఏసీల వినియోగంతో పాటు నీటి అవసరాలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ సమయంలో హైదరాబాద్ నగరంలో 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
2/5
జలమండలి అలర్ట్
ప్రధానంగా కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్-2 లో మరమ్మతులు చేపట్టడం వల్ల అక్టోబర్ 5 ఉదయం 6 గంటల నుండి అక్టోబర్ 6 సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదని జలమండలి తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.
3/5
36 గంటల నీటి కోత
ఈ మరమ్మతుల కారణంగా ఆదిభట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బి.ఎన్. రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతపూర్, వెంకటరెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్‌ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధ నగర్, లాలాపేట్‌లోని కొన్ని ప్రాంతాల్లో 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది.
4/5
హైదరాబాద్ మంచినీటి సరఫరా
అంతేకాకుండా హస్మత్ పేట, ప్రకాష్ నగర్, మేకల మండి, భోలక్ పూర్, పద్మరావు నగర్, బేగంపేట, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పాటిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్ నగర్, ఫిరోజ్ గూడ, బన్సీలాల్ పేట, రామ్ గోపాల్ పేట.
5/5
కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్-2
సీతాఫలమండి, మెట్టుగూడ, వైశాలి నగర్, మీరపేట, బడంగ్ పేట, బాలాపూర్, మైసూర్, బార్కాస్, శంషాబాద్, మధుబన్, ప్రశసన్ నగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా నిలిచిపోనుంది.