Hyundai Venue 2026: ఎప్పటి నుంచో మీరు Hyundai Venue 2026 కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఎంత మొత్తంలో డౌన్‌పేమెంట్ చెల్లిస్తే బాగుంటుంది? దీనికి సంబంధించిన EMI ఆప్షన్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Hyundai Venue 2026: భారత మార్కెట్‌లో కాంపాక్ట్ SUVలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో అత్యంత తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే కార్లను చాలా మంది ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే, మీరు కూడా ఎప్పటి నుంచో మంచి కాంపాక్ట్ SUV కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ వార్త మీ కోసమే.. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ప్రత్యేకమైన ఓ కారు బడ్జెట్ ప్లానింగ్ వివరాలు అన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
1/5
రూ.4,57,279 లోన్ అమౌంట్..
అయితే, తీసుకున్న రూ.4,57,279 లోన్ మొత్తానికి 4 సంవత్సరాల కాలంలో అసలతో పాటు వడ్డీ కలిపి మొత్తం రూ.5,37,888 బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే నాలుగు సంవత్సరాలకు వడ్డీ సుమారు రూ.80,609 మాత్రమే అవుతుంది. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో మంచి కారును కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు.
2/5
వడ్డీ రేటు
ఈ కారు రుణ మొత్తానికి బ్యాంకులు సంవత్సరానికి 8.20 శాతం వరకు వడ్డీ రేటును (Bank Interest Rate) నిర్ణయిస్తే.. 4 సంవత్సరాల (Loan Period) పాటు EMI ఆప్షన్ ఎంచుకుంటే..ప్రతి నెల EMI కేవలం రూ.11,206 మాత్రమే అవుతుంది. అంటే ప్రతి నెలా ఈ చిన్న అమౌంట్‌తో కొత్త SUV కారును మీ సొంతం చేసుకోవచ్చు..
3/5
ఆన్-రోడ్ ధర
హైదరాబాద్‌లో ఈ Hyundai Venue HX 2 Petrol మోడల్ ఆన్-రోడ్ ధర రూ.9,57,279తో అందుబాటులో ఉంది. అయితే, దీనిని ఇప్పుడే రూ.5,00,000 డౌన్‌పేమెంట్‌గా చెల్లించి కొనుగోలు చేయోచ్చు. మిగిలిన మొత్తం అమౌంట్ రూ.4,57,279 బ్యాంక్ లోన్ లభిస్తుంది..
4/5
హ్యుందాయ్ వెన్యూ 2026
హ్యుందాయ్ వెన్యూ 2026 కారును డైరెక్ట్ ఒకేసారి పేమెంట్ చేసి కొనుగోలు చేయాలేని వారికోసం బ్యాంక్‌లు అద్భుతమైన ఫైనాన్స్ ఆప్షన్స్‌ను కూడా అందిస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కొన్ని షోరూమ్స్‌లో హ్యుందాయ్ వెన్యూ HX 2 పెట్రోల్ (Hyundai Venue HX 2 Petrol) వేరియంట్‌పై ఆఫర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వేరియంట్‌ను ఫైనాన్స్‌లో ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
5/5
కాంపాక్ట్ SUV
భారత కాంపాక్ట్ SUV మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన మోడళ్లలో హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) ఒకటిగా భావించవచ్చు. ఇది ఎంతో అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉండడమే కాకుండా చాలా ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇటీవలే లాంచ్ అయిన 2026 కారును చాలా మంది ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు.