Kartik mass effect: కార్తీక పౌర్ణమి నేపథ్యంలో కొన్ని రాశులకు అత్యంత శుభఫలితాలు కల్గుతాయి. ముఖ్యంగా దీప దానం, నదీస్నానాల వల్ల గొప్ప పుణ్య ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
1/5
కార్తీక మాసం:
కార్తీక మాసం అనేది తెలుగు మాసాలన్నింటిలో అత్యంత పవిత్రమైనది. ఈ నెల రోజుల పాటు మనం చేసే పూజలు, వ్రతాలు, దానాలు వెయ్యిరెట్లు గొప్పఫలితాల్ని ఇస్తాయి. అంతే కాకుండా కార్తీక పౌర్ఱమి విశేషంగా చాలా మంచి తిథి అని పండితులు చెబుతుంటారు. మనం కార్తీక పౌర్ణమి పుణ్య తిథిని నవంబర్ 24న జరుపుకుంటాం.
2/5
కార్తీక పౌర్ణమి:
ముఖ్యంగా బ్రాహ్మీమూహుర్తంలో శివ, కేశవుల ప్రీతికొరకు దీపారాధన చేయడంతో పాటు జపాలు, ఆరాధన ఉత్తమ పుణ్య ఫలితాల్ని ఇస్తుందని చెప్తారు. అంతే కాకుండా ఈ రోజు 365 గుత్తిదీపంను కూడా వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజునే అరుదైన పారిజాత యోగం కూడా ఏర్పడబోతుంది. ఈ క్రమంలో కార్తీక పౌర్ణమి ప్రభావం అనేది ద్వాదశ రాశులపై ఉండనుంది. కొన్ని రాశులపై దీని ప్రభావం వల్ల గొప్ప యోగాలు కల్గుతాయి.
3/5
కన్య రాశి:
కన్య రాశి వీరికి కార్తీక పౌర్ణమి ప్రభావం వల్ల వ్యాపారాల్లో రాణిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే మీ కొరికలు నెరవేరుతాయి. రాబడి పెరిగి అప్పుల బాధలు తొలగుతాయి.
4/5
తుల రాశి:
తుల రాశి వీరు కోర్టు కేసుల నుంచి బైటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ జీవితాల్లో గొప్ప మార్పులు సంభవిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఉన్నత పదవుల్ని చేపడతారు. తోబుట్టువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి.
5/5
ధనస్సు రాశి:
ధనస్సు..ఈ రాశుల వారు రాజకీయాల్లో రాణిస్తారు. సొంతింటి కల నెరవేరుతుంది. లాటరీలు తగిలే చాన్స్ లు కన్పిస్తున్నాయి. గవర్నమెంట్ జాబ్ ను పొందే సూచనలు కన్పిస్తున్నాయి. ఆర్థికంగా మీకు భారీగా ధనలాభం కన్పిస్తుంది.( గమనిక- ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధార పడి ఉంటుంది. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)