Khairatabad Ganesh Nimajjanm Completes Pics Goes Viral: గణేశ్ ఉత్సవాలు 11వ రోజు హైదరాబాద్లో ముగిశాయి. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జనం కోలాహలంగా ముగిసింది. తెల్లవారుజామున మొదలైన శోభయాత్ర అత్యంత వేగంగా పూర్తయ్యింది. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఫొటోలు చూసేయండి.
గణేశ్ ఉత్సవాలు 11వ రోజు హైదరాబాద్లో ముగిశాయి. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జనం కోలాహలంగా ముగిసింది. తెల్లవారుజామున మొదలైన శోభయాత్ర అత్యంత వేగంగా పూర్తయ్యింది. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఫొటోలు చూసేయండి.
1/5
Khairatabad Ganesh Viral Photos
తెలంగాణలో గణేశ్ ఉత్సవాలు 11వ రోజుతో ముగిశాయి. విశేష పూజలు అందుకున్న గణనాథుడిని జయజయ ధ్వానాల మధ్య భక్తులు వీడ్కోలు పలికారు. ముఖ్యంగా హైదరాబాద్లో అత్యంత వైభవంగా సాగిన ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర ముగిసింది. ఖైరతాబాద్ బడా గణేశ్ గంగమ్మ ఒడికి చేరాడు.
2/5
Khairatabad Ganesh Viral Pics
దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహా వినాయకుడు 11 రోజుల పాటు విశేష పూజలందుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున బడా గణేశ్ శోభయాత్ర ప్రారంభమైంది. అశేష భక్తజనం మధ్య గణనాథుడు ట్యాంక్బండ్ వైపు పయనమయ్యాడు. శోభయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
3/5
Khairatabad Ganesh Pics
అతి పెద్ద వినాయకుడు శోభయాత్రలో తరలివెళ్తుంటే భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వినాయకుడిని సాగనంపారు. ఖైతరాబాద్ సెన్సేషన్ సన్షైన్ థియేటర్ మీదుగా.. వాసవీ భవన్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మీనార్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఖైరతాబాద్ వినాయకుడు విచ్చేశాడు.
4/5
Khairatabad Ganesh At Secretariat
తెలంగాణ సచివాలయం వద్దకు రాగానే పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్వేతవర్ణంలో మెరుస్తున్న సెక్రటేరియట్ వద్ద గణనాథుడు చూడముచ్చటగా కనిపించాడు. వెంటనే కెమెరా కళ్లన్నీ వినాయకుడు, సెక్రటేరియట్ను కలిపి ఫొటోలు, వీడియోలు తీశారు. డ్రోన్లు ఆ అద్భుత దృశ్యాన్ని తీసేందుకు పోటీపడ్డాయి.
5/5
Khairatabad Ganesh Nimajjanam
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఖైరతాబాద్ గణనాథుడు అందంగా కనిపించాడు. సచివాలయం వద్ద గణనాథుడి దృశ్యాలు వైరల్గా మారాయి. వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి.