Mahindra Thar Og Emi Plan: మీరు కూడా ఎప్పటినుంచో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన మహీంద్రా థార్ og వేరియంటును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ అందుబాటులో ఉంది. ఎంత డౌన్ పేమెంట్ కడితే దీనిని కొనుగోలు చేసే వారికి బెనిఫిట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Mahindra Thar Og Emi Plan Telugu: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజన సొంతం చేసుకున్న ఆఫ్-రోడర్ ఎస్‌యూవీల్లో మహీంద్రా థార్ ఒకటి. అద్భుతమైన డిజైన్‌లో పాటు ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా యువతను ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే మార్కెట్లో దీని సేల్స్ విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే మహీంద్రా కంపెనీ కొత్త వేరియంటును కూడా విడుదల చేసింది.
1/5
వడ్డీ భాగం..
అంటే తీసుకున్న లోను మొత్తం రూ.7.21 లక్షలకు.. ఐదేళ్ల వడ్డీతో కలిపి దాదాపు రూ. 8,96,760 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇందులో వడ్డీ భాగం సుమారు రూ. 1,75,065 అవుతుంది. కాబట్టి, ఎక్కువగా ఇలాంటి SUV లను ఇష్టపడేవారు తప్పకుండా ప్రతి నెల కేవలం రూ. 14,946 EMI తో దీనిని సులభంగా సొంతం చేసుకోవచ్చు.
2/5
ప్రతి నెల ఈఎంఐ
ప్రస్తుతం బ్యాంకులో ఆటో లోన్లపై అందిస్తున్న వడ్డీ రేటు దాదాపు రూ.8.90 శాతం గా ఉంది. అయితే ఈ వడ్డీ రేటు ప్రకారం దాదాపు 60 నెలలపాటు ఈఎంఐ ఆప్షన్ ప్రతి నెల ఈఎంఐ (Monthly EMI) రూ.14,946 అవుతుంది. మీరు మొత్తం ఈ వడ్డీ రేటుతో దాదాపు రూ. 8,96,760 తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
3/5
ఆన్-రోడ్ ధర..
హైదరాబాద్‌లో మహీంద్రా థార్ 1.5L AXT డీజిల్ RWD వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 12,71,695తో అందుబాటులో ఉంది. అయితే, దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారు రూ. 5,50,000 డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. మిగతా రూ.7,21,695 బ్యాంకులు లోన్ అందిస్తాయి.
4/5
మహీంద్రా థార్ 1.5L AXT డీజిల్ RWD
మహీంద్రా థార్ వేరియంట్లలో మంచి డిమాండ్ ఉన్న మహీంద్రా థార్ 1.5L AXT డీజిల్ RWD (Mahindra Thar 1.5L AXT Diesel RWD) మోడల్ ను నేటి యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రీమియం లుక్ లో కనిపించడమే కాకుండా.. ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే, దీనిపై ఉన్న ఈఎంఐ ఆప్షన్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
5/5
బెస్ట్ ఆప్షన్
మహీంద్రా కంపెనీ సెప్టెంబర్ 22వ తేదీన మార్కెట్లోకి మహీంద్రా థార్ og వేరియంటును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి రావడం విశేషం. అయితే, ఎప్పటినుంచో మీరు కూడా మంచి ఆఫ్-రోడర్ SUV కొనుగోలు చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు..