• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /'హలో బ్రదర్' చిత్రంలో నాగార్జున డూప్‌గా నటించింది ఈ స్టార్ హీరో అని తెలుసా.. !

'హలో బ్రదర్' చిత్రంలో నాగార్జున డూప్‌గా నటించింది ఈ స్టార్ హీరో అని తెలుసా.. !

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 26, 2026, 05:59 AM IST|Updated: Oct 26, 2026, 10:01 AM IST
joinshare

Nagarjuna Dupe: అక్కినేని నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు సినీ వారసుడిగా అడుగుపెట్టి ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అంతేకాదు ఈయన  సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. అందులో 'హలో బ్రదర్' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంలో నాగార్జున.. ఫస్ట్ టైమ్  పూర్తి స్థాయిలో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారు. ఇక ఈ చిత్రంలో ఇద్దరు నాగ్ లు కనిపించే సన్నివేశాలున్నాయి. ఆ సమయంలో నాగార్జునకు ఓ స్టార్ హీరో డూప్‌గా నటించారు.

Nagarjuna Dupe:1/5

నాగార్జున డూప్

Nagarjuna Dupe: అక్కినేని నాగార్జున.. క్లాస్ హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తూనే.. మాస్ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాగ్ కెరీర్‌లో కొన్ని చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉన్నాయి. అందులో మజ్ను, గీతాంజలి, శివ, అన్నమయ్య, హలో బ్రదర్ వంటి చిత్రాలున్నాయి.
First Time Dual Role2/5

ఫస్ట్ టైమ్ డ్యూయల్‌ రోల్లో

ఇందులో నాగార్జున హీరోగా యాక్ట్ చేసిన 'హలో బ్రదర్' చిత్రంలో ఫస్ట్ టైమ్ డ్యూయల్‌ రోల్లో కనిపించారు నాగార్జున. ఇ.వి.వి.సత్యనారాయణ డైరెక్ట్ చేసి ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మించారు. ఈ సినిమాకు కోటీ అద్భుతమైన సంగీతం అందించారు. అంతేకాదు ఈ చిత్రం బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 'హలో బ్రదర్' మూవీని ఎన్టీఆర్ 'రాముడు భీముడు' తరహాలో ఒక క్యారెక్టర్ అమాయకుడు అయితే.. మరో పాత్ర గడుసుతనం నిండిన క్యారెక్టర్.
Hello Brother 3/5

హలో బ్రదర్

‘హలో బ్రదర్' మూవీలో నాగార్జున రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమాల నాగార్జున సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాలో నాగార్జున డూప్‌గా హీరో శ్రీకాంత్ యాక్ట్ చేసినట్టు అప్పట్లో ప్రసారమైన బిగ్‌బాస్ షో ఫినాలేలో సీక్రెట్ రివీల్ చేశారు.
Nag Dupe 4/5

నాగార్జున డూప్

ఇక హీరో శ్రీకాంత్‌కు దర్శకుడు ఇవివి సత్యనారాయణతో మంచి ర్యాపో ఉంది. అంతకు ముందు శ్రీకాంత్.. నాగ్‌ హీరోగా నటించిన 'వారసుడు'లో విలన్‌గా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం','నిన్నే ప్రేమిస్తా' చిత్రాల్లో నాగ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇంకోవైపు శ్రీకాంత్, నాగార్జున దాదాపు ఒకే ఎత్తు, పర్సనాలిటీ ఉండటంతో ఇద్దరు నాగార్జునలు కనిపించే సన్నివేశాల్లో శ్రీకాంత్ డూప్‌గా యాక్ట్ చేశారు.
Nagarjuna 5/5

నాగార్జున

ఇక నాగార్జున.. హలో బ్రదర్ మూవీ తర్వాత 'ఎదురులేని మనిషి', సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో నటించారు. హలో బ్రదర్‌లో కవల సోదురులుగా యాక్ట్ చేశారు నాగార్జున. అటు ఎదురులేని మనిషి.. ఏజ్ గ్యాప్ ఉన్న అన్నదమ్ముల పాత్రలో నటించారు. ఇక 'సోగ్గాడే చిన్నినాయనా', 'బంగార్రాజు' సినిమాల్లో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. నాగార్జున..త్వరలో తన వందో చిత్రం ‘కింగ్ 100’ మూవీతో పలకరించబోతున్నారు. ఈ చిత్రం ఈ యేడాది డిసెంబర్ 24న విడుదల కానుంది.
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie

Trending

  • News
  • Photos
  • Videos
Rahul Gandhi Accident: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు..!

Rahul Gandhi Accident: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు..!

2

అక్టోబర్ 31 నుంచి గురు గ్రహం ప్రభావం.. ఈ 4 రాశులవారికి ధనలాభం, జాక్‌పాట్ ఖాయం!

3

తలుపులు, లైట్లు లేని టాయిలెట్లు.. హైదరాబాద్ బస్తీల్లో ఆడపిల్లల పీరియడ్స్ కష్టాలపై షాకింగ్ రిపోర్ట్..!!

4

శని నక్షత్ర సంచారంతో 107 రోజుల పాటు అదృష్టం? ఈ 4 రాశులవారికి జాక్‌పాట్ టైమ్!

5

ఏపీ వైపు భారీ తుపాను.. 140 కి.మీ వేగంతో ఈదురు గాలులు.. 5 జిల్లాలకు భారీ వర్షాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.