Ola S1 X Down Payment: ప్రతి నెల కేవలం మీరు రూ. 2,303తో EMI చెల్లించి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..OLA S1 X 2 kWh స్కూటర్ ది బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. ఎందుకంటే ఇది తక్కువ ధరలో అత్యంత తక్కువ డౌన్ పేమెంట్తో కొనుగోలు చేయొచ్చు. అయితే, దీనికి సంబంధించిన బడ్జెట్ ప్లానింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Ola S1 X 2 Kwh Price: దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సమయంలో సామాన్యులు సైతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతూ వస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ ఓలా ఎస్1 ఎక్స్ 2 కిలోవాట్ అవర్ (OLA S1 X 2 kWh) వేరియంట్ కు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. మిడిల్ క్లాస్ వినియోగదారులు ఎక్కువగా దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎప్పటినుంచో మీరు కూడా ఇదే స్కూటర్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
1/5
30 నెలల పాటు ఈఎంఐ
ఈ స్కూటర్‌పై దాదాపు 30 నెలల పాటు ఈఎంఐ చెల్లిస్తే.. ఫైనాన్స్ సంస్థకి మనం మొత్తం రూ.69,090 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, అన్ని నెలలు కలిసి వడ్డీ కేవలం రూ.10,288 మాత్రమే అవుతుంది. ఇక ఈ మోటార్ సైకిల్ ఎవరికీ ఎక్కువగా సూటబుల్ అవుతుందంటే... రోజు ఆఫీస్‌కి వెళ్లాలనుకునేవారు.. ముఖ్యంగా ఉద్యోగులతో పాటు విద్యార్థులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈ స్కూటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.. అలాగే తక్కువ బడ్జెట్‌తో పాటు EMIతో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.
2/5
అతి తక్కువ ఖర్చు
రోజులో అతి తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ గా భావించవచ్చు. ఎందుకంటే దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు రూ.80 మాత్రమే ఖర్చవుతుంది.. ఇక దీనికి సంబంధించిన వడ్డీ లెక్కల వివరాల్లోకి వెళితే.. ఫైనాన్స్ సంస్థలు దీనికి రూ.58,802 మొత్తం రుణాన్ని అందిస్తే.. వడ్డీ కేవలం రూ.10,288 మాత్రమే అవుతుంది.
3/5
జీరో డౌన్ పేమెంట్
అయితే, దీనిని కంపెనీ జీరో డౌన్ పేమెంట్‌తో కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ అనేది డీలర్ షిప్ లను బట్టి అందుబాటులో ఉంది. అలాగే దీనిని ఫైనాన్స్ తో కొనుగోలు చేయాలనుకునే వారికి చాలా తక్కువ వడ్డీ రేటు 6.99 శాతం మాత్రమే అందిస్తున్నాయి. పైన పేర్కొన్న డౌన్ పేమెంట్ చెల్లించి 30 నెలల పాటు ఈఎంఐ ఆప్షన్ చూస్ చేసుకుంటే.. ప్రతినెల కిస్తీ రూపంలో రూ.2,303 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
4/5
ప్రతి నెల EMI ఆప్షన్
వినియోగదారుడు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేసే సమయంలో అత్యంత తక్కువ కేవలం రూ.31 వేలు మాత్రమే డౌన్ పేమెంట్ చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తం కోసం ఫైనాన్స్‌కి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే ఫైనాన్స్ సంస్థలు రూ.58,802 వరకు లోన్ అందిస్తాయి. దీంతో మీరు డైరెక్ట్‌గా ప్రతి నెల EMI ఆప్షన్ ఎంచుకోవచ్చు.
5/5
OLA S1 X 2 kWh స్కూటర్
OLA S1 X 2 kWh స్కూటర్ అత్యంత తక్కువ ధరలోనే లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్పై అద్భుతమైన ఈఎంఐ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో ప్రయాణాలకు ఎంతో అనుకూలమైన స్కూటర్ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ బడ్జెట్ ప్లానింగ్ అద్భుతమైన ఊరటను అందిస్తోంది. అయితే, అత్యంత తక్కువ ఈఎంఐ తో ఎలా కొనుగోలు చేయాలో? ఎంత డౌన్ పేమెంట్ కడితే బెనిఫిట్ లభిస్తుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..