• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Omar Abdulla Wedding: 56 ఏళ్ల వయసులో జర్నలిస్టును రెండో పెళ్లి చేసుకున్న ముఖ్యమంత్రి

Omar Abdulla Wedding: 56 ఏళ్ల వయసులో జర్నలిస్టును రెండో పెళ్లి చేసుకున్న ముఖ్యమంత్రి

Written By Ravi Kumar Sargam
Published: Oct 31, 2026, 07:59 PM IST|Updated: Oct 31, 2026, 08:06 PM IST
joinshare
Omar Abdulla Married To Nidhi Razdan At 56 Years: మొదటి భార్యకు విడాకులు మంజూరవుతున్న వేళ వెంటనే ముఖ్యమంత్రి రెండో వివాహం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఓ జర్నలిస్టును వివాహమాడారు. ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Omar Abdulla Nidhi Razdan Marriage: తొలి భార్యకు విడాకులు ఇవ్వకముందే జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి రెండో వివాహం చేసుకున్నారు. ఎంతోకాలంగా సన్నిహిత్యం కొనసాగిస్తున్న ఓ జర్నలిస్టును ఆయన వివాహమాడాడు. ఒమర్‌ అబ్దుల్లా పెళ్లికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Omar Abdulla Nidhi Razdan Marriage1/6

Omar Abdulla Nidhi Razdan Marriage

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఇది రెండో పెళ్లి. ఆయన తొలి వివాహం 1994లో సైనికాధికారి కుమార్తె పాయల్ నాథ్‌తో జరిగింది. వివాహం తర్వాత వారికి జహీర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారి వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత భేదాభిప్రాయాలు వచ్చాయి. వీరిద్దరి విడాకుల అంశం ప్రస్తుతం న్యాయ పరిధిలో ఉంది. ఇటీవల వారిద్దరి మధ్య విడాకులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. త్వరలోనే వారిద్దరి మధ్య విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది.
Omar Abdullah Nidhi Razdan Wedding2/6

Omar Abdullah Nidhi Razdan Wedding

ఒమర్‌ అబ్దుల్లా వివాహం చేసుకున్న నిధి రజ్దాన్ నేపథ్యం గురించి మాట్లాడితే ఆమె సరస్వత్ బ్రాహ్మణ వర్గానికి చెందిన కాశ్మీరీ పండిట్ కమ్యూనిటీకి చెందినవారు. ఆమె తండ్రి మహారాజ్ కృష్ణ రజ్దాన్ వార్తా సంస్థ పీటీఐ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్. ఆమె కుటుంబం జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్‌కు చెందింది. నిధి రజ్దాన్‌కు కూడా ఇది రెండో వివాహం. అంతకుముందు ఆమె 2005లో జర్నలిస్ట్, రచయిత నీలేష్ మిశ్రాతో వివాహమైంది. ఆ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత ఒమర్‌ అబ్దుల్లాతో ఆమె సాన్నిహిత్యం పొందారు.
Omar Abdullah Nidhi Razdan Wedding3/6

Omar Abdullah Nidhi Razdan Wedding

సీనియర్‌ జర్నలిస్టుగా ఉన్న నిధి రజ్దాన్ ఒక ప్రసిద్ధ న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నారు. ఆమె చాలా కాలం పాటు ప్రముఖ ఆంగ్ల టీవీలో పనిచేశారు. అనేక కీలకమైన షోలకు యాంకరింగ్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఆమె డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టారు. జర్నలిస్టుగా నిధి రజ్దాన్ పలు ప్రభుత్వాలను ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తూ వచ్చారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రభుత్వ విధానాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు.
Omar Abdulla Nidhi Razdan Marriage4/6

Omar Abdulla Nidhi Razdan Marriage

యాంకర్ నిధి రజ్దాన్‌తో కలిసి జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించినట్లు జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఉంగరం ధరించి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. దీని ద్వారా తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు.
Omar Abdulla Married To Nidhi Razdan5/6

Omar Abdulla Married To Nidhi Razdan

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జీవితంలో కీలక అడుగు వేశారు. మొదటి భార్య పాయల్‌కు దూరమైన తర్వాత ఆయన రెండో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్ నిధి రజ్దాన్‌. ఆమెతో కొంతకాలంగా ఆయన సాన్నిహిత్యం కొనసాగించారు.
Omar Abdulla Nidhi Razdan Marriage6/6

Omar Abdulla Nidhi Razdan Marriage

Omar Abdulla Nidhi Razdan Marriage: తొలి భార్యకు విడాకులు ఇవ్వకముందే జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి రెండో వివాహం చేసుకున్నారు. ఎంతోకాలంగా సన్నిహిత్యం కొనసాగిస్తున్న ఓ జర్నలిస్టును ఆయన వివాహమాడాడు. ఒమర్‌ అబ్దుల్లా పెళ్లికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
TAGS:
National News
Telugu News
Trending News

Trending

  • News
  • Photos
  • Videos
Raptadu Incident Update: రాప్తాడు ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థినిని బెంగళూరు తరలింపు..మెరుగైన వైద్యం కోసం మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ!

Raptadu Incident Update: రాప్తాడు ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థినిని బెంగళూరు తరలింపు..మెరుగైన వైద్యం కోసం మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ!

2

Chandrababu: సీఎం చంద్రబాబు 53 రోజుల జైలు జీవితానికి మూడేళ్లు!

3

Electricity Bill: ఏసీ రిమోట్‌లోని ఈ చిన్న బటన్.. మీ కరెంట్ బిల్లుని చాలా ఆదా చేస్తుంది!

4

Celebrity Chain Smokers: ధూమపానానికి బానిసలైన టాప్ హీరోయిన్స్ వీళ్ళే..!

5

Goa Crime News: దారుణం.. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలోనే బాలికపై ఇన్‌స్పెక్టర్‌ లైంగిక దాడి..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.