Renault Triber Price In Hyderabad: కేవలం రూ.7,420 EMIతో రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఎంత మొత్తంలో డౌన్‌పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఏ వేరియంట్ బేస్ట్.. అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Renault Triber Price In Hyderabad: భారత మార్కెట్‌లో అత్యంత తక్కువ బడ్జెట్‌లో 7-సీటర్ మల్టీ పర్పస్ వెహికల్ (MPV) విభాగంలో రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber)కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది అద్భుతమైన క్యాబిన్‌తో పాటు ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది మధ్యతరగతి కుంటుంబాలకు బెస్ట్ చాయిస్‌గా భావించవచ్చు.. అయితే, ఎప్పటి నుంచో దీనిని కొనుగోలు చేయాలనుకునేవారికి అద్భుతమైన బడ్జెట్ ఫ్లానింగ్‌ను అందిస్తున్నాం..
1/5
రూ.7,420 వరకు EMI
ప్రతి నెల నాలుగు సంవత్సరాల పాటు రూ.7,420 వరకు EMI చెల్లించాలనుకునేవారికి ఈ కారు చాలా బెస్ట్‌గా భావించవచ్చు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ కారు ఎంతో బాగుంటుంది. కాబట్టి చిరు ఉద్యోగులతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈ కారు చాలా బాగుంటుంది. కాబట్టి దీనిని కొనుగోలు చేయాలనుకుంటే ఈ బడ్జెట్ ఫ్లానింగ్ చాలా బెస్ట్‌గా భావించవచ్చు.
2/5
లోన్ అమౌంట్ రూ.2,93,653
రెనాల్ట్ ట్రైబర్ సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దీనిని హైదరాబాద్ ఆన్-రోడ్ ధర రూ.6,93,653 కాగా.. రూ.4,00,000 వరకు డౌన్‌పేమెంట్ చెల్లిస్తే.. మొత్తం లోన్ అమౌంట్ రూ.2,93,653 అవుతుంది. నాలుగేళ్లకు వడ్డీతో మొత్తం రూ.3,56,160 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 4 ఏళ్ల కాలానికి వడ్డీ రూ.62,507 వరకు అవుతుంది.
3/5
EMI ఆప్షన్
అయితే, మీరు దీనిని EMI ఆప్షన్‌తో కొనుగోలు చేయాలనుకుంటే.. మీరు 4,00,000 డౌన్‌పేమెంట్ చెల్లిస్తే..మిగిలిన మొత్తం కోసం బ్యాంకులు రూ.2,93,653 లోన్ అందిస్తుంది. అయితే, కొన్ని డీలర్ షిప్స్లో జీరో డౌన్‌పేమెంట్‌తో కూడా దీనిని కొనుగోలు చేయోచ్చు. అయితే, దీనికి 9.8 శాతం వడ్డీ రేటు అయితే కేవలం ప్రతి నెల రూ.7,420 మాత్రమే అవుతుంది.
4/5
రెనాల్ట్ డీలర్ షిప్స్
హైదరాబాద్‌లో కొన్ని రెనాల్ట్ డీలర్ షిప్స్‌లో రెనాల్ట్ ట్రైబర్ అథెంటిక్ పెట్రోల్ (Renault Triber Authentic Petrol 6.94 Lakh) బేస్ వేరియంట్‌పై అద్భుతమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా EMI ఆప్షన్‌తో దీనిని కొనుగోలు చేయాలనుకునేవారికి మంచి బడ్జెట్ ఫ్లానింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు రూ.6,93,653తో అందుబాటులో ఉంది.
5/5
7-సీటర్ మల్టీ పర్పస్ వెహికల్
రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) 7-సీటర్ మల్టీ పర్పస్ వెహికల్ భారత మార్కెట్‌లోకి లాంచ్ అయ్యింది. ఇది గత మోడల్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో లభించడం విశేషం.. ఎప్పటి నుంచో మంచి కారును కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్..