Royal Enfield Hunter 350 EMI: మీరు కూడా Royal Enfield Hunter 350 మోటర్ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ప్రతి నెల రూ.3,027 EMI చూజ్ చేసుకునేవారు ఎంత మొత్తంలో డౌన్ పేమెంట్ కట్టాలో? దీనికి సంబంధించిన బడ్జెట్ ప్లానింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Royal Enfield Hunter 350 EMI: భారత మార్కెట్‌లో క్లాసిక్, రెట్రో-మోడ్రన్ బైకులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది యువత వివిధ మోటర్ సైకిల్ కంపెనీలు విడుదల చేసిన బైకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో Royal Enfield Hunter 350 మోటర్ సైకిల్‌కి మంచి డిమాండ్ ఉంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ విచ్చలవిడిగా అమ్ముడుపోతోంది. అయితే, ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన బడ్జెట్ ప్లానింగ్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1/5
స్వల్ప మార్పులు..
ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునేవారు క్రెడిట్ స్కోరు (CIBIL Score) బాగుంటేనే మీరు ఈ బడ్జెట్ ప్రకారం మోటర్ సైకిల్ కొనుగోలు చేయోచ్చు. లేదంటే డౌన్‌పేమెంట్‌తో పాటు వడ్డీ రేట్లలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీకు దగ్గరగా ఉన్న డీలర్‌షిప్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
2/5
మధ్యతరగతి వారికోసం..
చాలా మందికి ఎప్పటి నుంచో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనుగోలు చేయాలనుకునే కోరిక ఉంటుంది. నెలకు ఎక్కువ భారం మోయలేని మధ్యతరగతి ఉద్యోగులు, యువతకు ఈ ఐదేళ్ల ఈఎంఐ ప్లాన్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ఈ బడ్జెట్ ఫ్లానింగ్‌తో ఈ మోటర్ సైకిల్ కొనుగోలు చేస్తే ఎలాంటి భారం కూడా ఉండదు..
3/5
మొత్తం వడ్డీ..
ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్యాంక్ నుంచి తీసుకున్న మొత్తం అమౌంట్ రూ.1,21,063 అయితే.. దీనికి చెల్లించాల్సిన మొత్తం వడ్డీ రూ.60,557 అవుతుంది. అంటే మీరు 60 నెలలకు రూ.1,81,620 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
4/5
వడ్డీ రేటు..
పైన బ్యాంక్ అందించిన మొత్తం అమౌంట్‌కి వడ్డీ రేటు 10 శాతం నిర్ణయించుకుని.. ఈ లోన్‌ను తిరిగి చెల్లించేందుకు 5 సంవత్సరాల పాటు EMI ఆప్షన్ పెట్టుకుంటే.. ప్రతి నెల రూ.3,027 మాత్రమే EMI చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతి రోజు కేవలం రూ.100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
5/5
బ్యాంక్ లోన్
Royal Enfield Hunter 350 బైక్‌కి సంబంధించిన బడ్జెట్ వివరాల్లోకి వెళితే.. దీనిని కొనుగోలు చేయాలనుకునేవారు రూ.59,100 డౌన్‌పేమెంట్‌గా చెల్లించి బైక్ బుక్ చేసుకోవచ్చు. మిగిలి అమౌంట్‌ను రూ.1,21,063 బ్యాంక్ లోన్ పొందవచ్చు. అంతేకాకుండా కొన్ని డీలర్ షిప్స్‌లో కంపెనీ జీరో డౌన్‌పేమెంట్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.