Tata Aeris News: భారత మార్కెట్లోకి సెప్టెంబర్ 25వ తేదీన టాటా ఏరిస్ విడుదలైంది. ఈ కారు అద్భుతమైన ఫీచర్లతో పాటు ప్రత్యేకమైన డిజైన్లు కలిగి ఉంటుంది. అయితే, దీనిని కేవలం మూడు లక్షల డౌన్ పేమెంట్ తో ఎలా పొందాలో? ఈ డౌన్ పేమెంట్ కడితే ఎంత మొత్తంలో అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది? ఈఎంఐ ఆప్షన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Tata Aeris News: సొంత కారు కొనాల్ అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక అతిపెద్ద కలగా భావించవచ్చు. భారత ఆటోమొబైల్ రంగంలో అద్భుతమైన నమ్మకంతో పాటు ప్రజాదరణ సంపాదించుకున్న బ్రాండ్లలో టాటా ఒకటి.. భారతీయులు ఎక్కువగా తాటాకారులను కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతూ ఉంటారు. ఇవి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో అందుబాటులోకి రావడం వల్ల చాలామంది వీటిని కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు..
1/5
ధర రూ.6,38,483
ఇక వడ్డీతో పాటు EMI లెక్కల వివరాల్లోకి వెళితే.. ఈ కారు ధర రూ.6,38,483 కాగా.. మీరు డౌన్ పేమెంట్ రూపంలో రూ. 3 లక్షలు మాత్రమే చెల్లిస్తే.. బ్యాంకు రూ.3,38,483 వరకు లోన్ అందిస్తుంది. దీంతో మొత్తం ప్రతినెల వడ్డీ కలుపుకొని మీరు రూ.47,869 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు మొత్తం దాదాపు రూ.3,86,352 వరకు రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది..
2/5
8. 80 శాతం వడ్డీ రేటు
మిగిలిన రూ.3,38,483 లోన్ పద్ధతిలో పొందవచ్చు. అయితే, ఈ కారు పై బ్యాంకు 8. 80 శాతం వడ్డీ రేటుతో 36 నెలల పాటు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే ప్రతి నెల ఈఎంఐ కేవలం రూ.10,732 మాత్రమే అవుతుంది. EMIని కావాలనుకుంటే ఏడు సంవత్సరాల వరకు కూడా పెట్టుకోవచ్చు..
3/5
ఆన్-రోడ్ ధర
తాజాగా కంపెనీ అందించిన వివరాల ప్రకారం హైదరాబాద్ టాటా షోరూమ్స్‌లో టాటా ఏరిస్ స్మార్ట్ పెట్రోల్ ఎంటీ మోడల్ ఆన్-రోడ్ ధర సుమారుగా రూ.6,38,483 గా ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిని కొనుగోలు చేయాలనుకునేవారు కేవలం రూ.3 లక్షల రూపాయల వరకు డౌన్ పేమెంట్ చెల్లిస్తే సరిపోతుంది.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి లోన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది..
4/5
అద్భుతమైన డిజైన్
దీనిని టాటా కంపెనీ సెప్టెంబర్ 25వ తేదీన మార్కెట్లోకి విడుదల చేసింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఫీచర్లతో అందరినీ ఆకట్టుకుంది. అద్భుతమైన డిజైన్ కలిగి ఉండడమే కాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లతో లభిస్తుండడం వల్ల మిడిల్ క్లాస్ వినియోగదారులకు ఈ కార్ ఒక బెస్ట్ ఛాయిస్గా నిలవబోతోంది. అయితే దీనిని తక్కువ డౌన్ పేమెంట్‌తో ఎలా కొనుగోలు చేయాలో? ఈఎంఐ ఆప్షన్ వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
5/5
బెస్ట్ ఆప్షన్
మీరు కూడా ఎప్పటినుంచో మంచి టాటా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇటీవల లాంచ్ అయిన టాటా ఏరిస్ స్మార్ట్ పెట్రోల్ ఎంటీ (Tata Aeris Smart Petrol MT) వేరియంట్ బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు.. ఎందుకంటే ఇది అత్యంత తక్కువ ధరలోనే.. ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.