• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /DA Hike: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రెండు డీఏలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

DA Hike: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రెండు డీఏలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

Written ByVishnu Priya
Published: Oct 01, 2026, 21:21 IST|Updated: Oct 01, 2026, 21:26 IST
joinshare

DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండు డీఏలను చెల్లించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో డీఏల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించనుంది.
 

 Telangana pensioners1/5

తెలంగాణ పెన్షనర్లు

2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండు డీఏలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం సుమారు రూ.2,500 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. డీఏల చెల్లింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
 DA arrears2/5

డీఏ బకాయిలు

కేబినెట్ సమావేశంలో తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులపై కూడా చర్చ జరిగింది. రాష్ట్రంలోని 235 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని అధికారులు మంత్రివర్గానికి వివరించినట్లు సమాచారం. ఈ అంశంపై కేబినెట్ సబ్‌కమిటీలో మరింత చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana Cabinet decisions3/5

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

కరువు పరిస్థితులపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులు, ప్రజలకు అందించాల్సిన ఉపశమన చర్యలపై వివిధ వర్గాల నుంచి సలహాలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. కరువు మండలాలను ప్రకటించడంతో పాటు రాష్ట్రానికి అవసరమైన సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం.
 Hyderabad police restructuring4/5

హైదరాబాద్ పోలీస్ పునర్వ్యవస్థీకరణ

ఇదే సమయంలో హైదరాబాద్ నగర పోలీస్ వ్యవస్థలో కూడా కీలక మార్పులు జరిగాయి. నగరంలోని జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల పరిధులను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి పోలీస్ పరిధుల్లో మార్పులు చేసినట్లు తెలిపింది.
 Telangana latest news5/5

తెలంగాణ తాజా వార్తలు

కొన్ని ప్రాంతాలను ఇతర జోన్లు, డివిజన్ల పరిధిలోకి మార్చారు. మల్కాజిగిరి, మహేశ్వరం, శంషాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లోనూ మార్పులు జరిగాయి. ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పేరును శంషాబాద్ పోలీస్ స్టేషన్‌గా మార్చారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్‌నగర్, రాజేంద్రనగర్, మీర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లోనూ పోలీస్ పరిధులను పునర్విభజించారు. లా అండ్ ఆర్డర్‌తో పాటు ట్రాఫిక్, ఉమెన్ సేఫ్టీ వింగ్, జోనల్ సైబర్ సెల్ పరిధుల్లో కూడా మార్పులు చేశారు. ప్రాంతాల వారీగా పోలీసింగ్‌ను మరింత సమర్థంగా నిర్వహించడమే ఈ మార్పుల ఉద్దేశంగా ప్రభుత్వం తెలిపింది.
TAGS:
DA Hike

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.