• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /తిరుమల మాడ వీధుల్లో అద్భుతం..పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి దర్శనం.. 8 రాష్ట్రాల కళాకారుల కోలాహలం!

తిరుమల మాడ వీధుల్లో అద్భుతం..పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి దర్శనం.. 8 రాష్ట్రాల కళాకారుల కోలాహలం!

Written ByRenuka Godugu
Published: Oct 13, 2026, 07:28 AM IST|Updated: Oct 13, 2026, 07:34 AM IST
joinshare

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా, అక్టోబర్ 12వ తేదీ రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు గోవిందరాజ స్వామి అలంకారంలో ఏడు తలల స్వర్ణ శేష వాహనంపై తిరుమల వీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేశారు. ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం.
 

Tirumala1/7

తిరుమల

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారికి ఇక్కడ విశేష సేవలు కూడా చేస్తారు. ప్రస్తుతం నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు స్వామి వారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
Pedda Sesha Vahanam Seva2/7

స్వర్ణ శేష వాహనం

నిన్న రాత్రి, అక్టోబర్ 12న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు గోవిందరాజస్వామి అలంకారంలో స్వర్ణ శేష వాహనంపై తిరుమల వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.
TTD3/7

టీటీడీ

ఈరోజు మంగళవారం ఉదయం చిన్న శేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై కూడా స్వామి వారు భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయ్యర్ స్వామి, చిన్న జీయ్యర్ స్వామితో పాటు శ్రీ టీటీడీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Navaratri Brahmotsavam4/7

నవరాత్రి బ్రహ్మోత్సవాలు

ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 17 కళాబృందాల వారు, మొత్తం 477 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. సాంప్రదాయ కళారూపాలతో వారు భక్తులను విశేషంగా అలరించారు.
Malayappa Swamy5/7

శ్రీ మలయప్ప స్వామి

భక్తి భావం ఉట్టిపడే జానపద నృత్యాలు, సంగీతం, రంగురంగుల వేషధారణలతో తిరుమలలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణం నెలకొంది. తమిళనాడు, అస్సాం, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
tirumala tieupati devasthanam6/7

తిరుమల తిరుపతి దేవస్థానం

ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధ జానపద కళారూపం తప్పెటగుళ్ళు, అరకు ప్రాంతానికి చెందిన గిరిజన నృత్యం థీంసా, తమిళనాడు కురవంజి, కర్ణాటక కళారూపాలు, అస్సాంకు చెందిన బిహు నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి.
Tirupati news today7/7

తిరుపతి శ్రీవారి వార్తలు

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహన సేవల సందర్భంగా వివిధ రాష్ట్రాల కళాబృందాలు ఈ ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు భారతీయ కళా సంపదను ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
TAGS:
Tirumala
Tirupathi

Trending

  • News
  • Photos
  • Videos
ఉపాధ్యాయుల కొరతతో కుదేలవుతున్న బడులు.. వేలమందిని మార్చినా తీరని తిప్పలు.. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు?

ఉపాధ్యాయుల కొరతతో కుదేలవుతున్న బడులు.. వేలమందిని మార్చినా తీరని తిప్పలు.. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు?

2

Nayanthara vs Trisha: త్రిషకు పోటీగా నయనతార.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్!

3

Bigg Boss Telugu Season 10 Nominations: బిగ్‌బాస్ 10లో రచ్చ రచ్చ.. నామినేషన్ల లిస్ట్‌లో ఉన్నది వీళ్లే!

4

ఎస్సెస్సీ, ఇంటర్ విలీనానికి బ్రేక్స్.. సీఎం వద్దే పెండింగ్‌లో ఫైల్.. వచ్చే విద్యాసంవత్సరం కూడా అమలు కష్టమే?

5

పటాకుల బ్యాన్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. మతానికి, టపాసులకు ముడిపెట్టొద్దు.. అసలు సంబంధమేంటన్న ధర్మాసనం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.