నవరాత్రి వేడుకల సందర్భంగా తిరుమల భక్తుల కోసం జారీ చేసే ఎస్‌ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం తొమ్మిది రోజుల పాటు రద్దు చేసింది. ఈ నిర్ణయం అక్టోబర్ 11 నుండి 20 వరకు అమల్లో ఉంటుంది. ఈ కాలంలో ఆఫ్ లైన్‌లో కూడా ఎలాంటి టికెట్లు జారీ చేయబోరు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/5
తిరుమల దర్శనం నిబంధనలు
రేపటి నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 11 నుండి 20 వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా రూ.300 టికెట్లు మంజూరు చేసినప్పటికీ, SSD, దివ్యదర్శనం టోకెన్లను మాత్రం రద్దు చేసింది.
2/5
తిరుమల
ఈ వ్యవధిలో ఎలాంటి టికెట్లు ఆఫ్ లైన్‌లో కూడా ఇవ్వరు. ఈ టోకెన్లను తిరిగి అక్టోబర్ 20 , 21వ తేదీల దర్శనం కోసం జారీ చేస్తారు. అయితే అక్టోబర్ 10 నుండి 19వ తేదీల వరకు ఎలాంటి టికెట్లు అందుబాటులో ఉండవు కాబట్టి, భక్తులు తిరుమలకు వెళ్లే ముందు ఈ విషయాన్ని గమనించాలి.
3/5
తిరుమల ఎస్‌ఎస్‌డీ టోకెన్ల రద్దు
SSD టోకెన్లను అక్టోబర్ 20వ తేదీ వరకు వాయిదా వేస్తున్నారు. నవరాత్రి సందర్భంగా భూదేవి, శ్రీదేవి కాంప్లెక్స్, శ్రీనివాసంలో జారీ చేసే ఈ టోకెన్లను రద్దు చేశారు. కాబట్టి భక్తులు ముందుగానే తెలుసుకుని తిరుమల దర్శనానికి రావాలి.
4/5
టీటీడీ నవరాత్రి బ్రహ్మోత్సవాలు
ఈ సమయంలో ఎలాంటి రికమండేషన్ లెటర్స్ కూడా తీసుకోరు. కేవలం ప్రోటోకాల్ దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు ప్రివిలేజ్ దర్శనాలైన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, డిఫెన్స్ సంబంధించిన దర్శనాలను కూడా రద్దు చేశారు.
5/5
తిరుమల దివ్యదర్శనం టికెట్లు
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 11 నుండి 20 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రస్తుతం పెరటాసి మాసం చివరి వారం కావడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా ఈ వివరాలను తెలుసుకోవాలి.