• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /APPSC బంపర్ ఆఫర్.. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ అవుట్.. డిగ్రీ అర్హతతో మంచి జీతం!

APPSC బంపర్ ఆఫర్.. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ అవుట్.. డిగ్రీ అర్హతతో మంచి జీతం!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 9వ తేదీన విడుదలైన ఈ నోటిఫికేషన్ ప్రకారం, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసులలో ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 29వ తేదీ లోపు APPSC అధికారిక వెబ్‌సైట్ https://portal-psc.ap.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, ఫీజు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 10, 2026, 09:34 AM IST|Updated: Oct 10, 2026, 09:42 AM IST
joinshare
APPSC బంపర్ ఆఫర్.. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ అవుట్.. డిగ్రీ అర్హతతో మంచి జీతం!
Image Credit: APPSC Hostel Welfare Officer Recruitment 2026

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రాహువు సంచారంతో అదృష్టం మారుతుందా.. కన్య, మేషం, తులా రాశుల వారికి ఎలాంటి ఫలితాలు?

రాహువు సంచారంతో అదృష్టం మారుతుందా.. కన్య, మేషం, తులా రాశుల వారికి ఎలాంటి ఫలితాలు?

2

ప్రధాని మోడీపై CJP అధినేత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..

3

ఢిల్లీ అష్ట దిగ్భంధం.. ధర్నాకు నో పర్మిషన్..

4

Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. దుకాణంలో ఉన్న మహిళపై కత్తితో దాడి.. అసలేం జరిగిందంటే..?

5

మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్‌.. ఈ 3 రాశులకు నవంబర్‌లో బంపర్ జాక్‌పాట్‌?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

APPSC Hostel Warden Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రాత పరీక్షతో పాటు కంప్యూటర్ అర్హత టెస్ట్‌ను కూడా తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. సోషల్, ట్రైబల్, బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అర్హత వివరాలు..
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు B.Ed లేదా తత్సమాన డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే, గరిష్టంగా 44 ఏళ్ల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష, కంప్యూటర్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి రూ. 37,640 నుండి రూ. 1,15,500 వరకు పే-స్కేల్ లభిస్తుంది.
అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌లోని సిలబస్, ఎగ్జామినేషన్ ఇతర నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. దరఖాస్తు అనంతరం నిర్ణీత ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు..
మొత్తం 97 పోస్టుల్లో ఏపీ సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసులో 41, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసులో 23,  ఏపీ బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసుల్లో 33 ఖాళీలు ఉన్నాయి.

వయోపరిమితి సడలింపు..
కనీస వయస్సు 18 ఏళ్లు , గరిష్ట వయస్సు 44 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ , EWS అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ ఖాళీల కోసం 10 ఏళ్లు, అలాగే PBWS, Ex-servicemen, NCC అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Read Also: ఇంజినీరింగ్ పూర్తి చేశారా? HAL నుండి బిగ్ నోటిఫికేషన్! రూ.1.2 లక్షల వరకు జీతం, అప్లై ప్రాసెస్ ఇదే!
 

దరఖాస్తు రుసుము..
పరీక్షా ఫీజుగా రూ. 80, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 250 చెల్లించాలి. మొత్తం కలిపి రూ. 330 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం..
అభ్యర్థులు మొదట APPSC అధికారిక వెబ్‌సైట్‌ https://portal-psc.ap.gov.in/ను సందర్శించి, వన్-టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్ అయిన OTP , పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి, 'ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్' విభాగంలో 'హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 రిక్రూట్మెంట్'ను ఎంచుకోవాలి. అక్కడ విద్యార్హతలు, లోకల్ స్టేటస్ వంటి వివరాలను నమోదు చేసి, ఫామ్‌ను వెరిఫై చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం ఫీజు చెల్లించి, దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరుచుకోవాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs
Job Notification
AP News