• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /తిరుమల బ్రహ్మోత్సవాలు.. హంస వాహనంపై సరస్వతీ దేవి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. హంస వాహనంపై సరస్వతీ దేవి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం!

Written ByRenuka Godugu
Published: Oct 14, 2026, 07:49 AM IST|Updated: Oct 14, 2026, 07:54 AM IST
joinshare

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 84 వేల మందికి పైగా శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 3.1 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు మొత్తం 23 కంపార్ట్‌మెంట్లలో వేచి చూస్తున్నారు. తిరుమలలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో, నిన్న మలయప్ప స్వామి వారు హంస వాహనంపై, సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు.
 

Sri Malayappa Swamy Saraswati Alankaram1/5

హంస వాహనంపై శ్రీ మలయప్పస్వామి

నవరాత్రి బ్రహ్మోత్సవాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. నవరాత్రుల భాగంగా రెండో రోజు రాత్రి శ్రీవారు వీణ ధరించి, సరస్వతి అలంకారంలో భక్తులను అలరించారు. విద్య, జ్ఞానం వివేకానికి ప్రతీకగా నిలిచిన స్వామి వారి ఈ దివ్య మంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వాహన సేవలో పలు రాష్ట్రాల కళాకారుల బృందాలు కూడా ప్రదర్శనలు ఇచ్చారు.
Tirumala Brahmotsavam Hamsa Vahanam2/5

తిరుమల బ్రహ్మోత్సవాలు 2026

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన హంస వాహన సేవలో భారతీయ శాస్త్రీయ, జానపద కళారూపాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. డోగ్రి, చక్రి, ఛాత్‌ పూజ వంటి విశిష్ట కళారూపాలతో మాడవీధుల్లో సాంస్కృతిక వైభవం కనిపించింది.
Lord Malayappa Swamy Veena Look3/5

సరస్వతీ అలంకారంలో శ్రీవారు

ఆంధ్రప్రదేశ్‌తో పాటు మొత్తం పది రాష్ట్రాల నుంచి వచ్చిన 16 కళాబృందాలకు చెందిన 443 మంది కళాకారులు ప్రదర్శనలు చేశారు. వీరు కూచిపూడి, భరతనాట్యం, డోలు, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఢోగ్రీ నృత్యంతో భక్తులను అలరించారు.
tirumala tieupati devasthanam4/5

తిరుమల తిరుపతి దేవస్థానం

ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, శ్రీవారి దర్శనం కోసం మొత్తం 23 వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూడాల్సి వస్తోంది. SSD టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది.
Tirumala5/5

తిరుమల

నిన్న ఒక్కరోజే 84 వేల మందికి పైగా శ్రీవారిని దర్శించుకోగా, అందులో 29 వేలమందికి పైగా తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.1 కోట్లుగా వచ్చిందని టీటీడీ తెలిపింది. అలాగే, మొత్తం 4.49 లక్షల లడ్డూల విక్రయాలు జరగగా, 2.5 లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరించారు.
TAGS:
Tirumala
Tirupathi

Trending

  • News
  • Photos
  • Videos
Russian Woman: ఇది కదా నిజమైన ప్రేమ... బీహర్ ప్రియుడి కోసం రష్యా నుంచి యువతి.. గుడిసెలోనే ఉంటానని రచ్చ..

Russian Woman: ఇది కదా నిజమైన ప్రేమ... బీహర్ ప్రియుడి కోసం రష్యా నుంచి యువతి.. గుడిసెలోనే ఉంటానని రచ్చ..

2

బంగారం కొనడానికి ఇదే మంచి సమయమా? కమోడిటీ నిపుణులు ఏమంటున్నారంటే..?

3

Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల హీట్ ప్రేమ వివాహం చేసుకున్న టీడీపీ నేత.. అసలు విషయం ఏమిటంటే..?..

4

UCO బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. రూ. 16,650 స్టైపెండ్, దరఖాస్తులు ప్రారంభం!

5

రొటీన్ మూస కథలకు నో చెబుతున్న మిడ్ రేంజ్ హీరోలు.. ఢిఫరెంట్ స్టోరీలతో ఆడియన్స్ అటెన్షన్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.