New Different Roles Heroes: ఈ మధ్యే ప్యారడైజ్తో రక్తపాతం సృష్టించారు నాని. అంతకు ముందు ‘హాయ్ నాన్న’ ‘సరిపోదా శనివారం’ అటు దసరా వంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అటెంప్ట్ చేశారు. ప్రస్తుతం సుజీత్తో ‘బ్లడీ రోమియో’ అంటూ స్టైలిష్ యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నారు. ఇందులో చెఫ్ కమ్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు న్యాచురల్ స్టార్. తర్వాత ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నట్టు సమాచారం.
రవితేజ నెక్ట్స్ మూవీ..
ఇరుముడితో ఎమోషనల్ బ్లాక్బస్టర్ హిట్ తర్వాత రవితేజ.. ఈసారి తులాభారంతో క్రైమ్, కామెడీ, పొలిటికల్ యాంగిల్స్ అన్నీ ఉన్న కథతో అలరించనున్నారు. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
విజయ్ దేవరకొండ..
పీరియాడిక్ రణబాలితో బిజీగా ఉన్నారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. తొలిసారి చారిత్రక పాత్రలో కనిపించనున్నారు. ఆ తర్వాత నెక్ట్స్ ‘రౌడీ జనార్ధన’గా ఫుల్ మాస్ జాతర చూపించడానికి రెడీ అవుతున్నారు. దాని తర్వాత హాయ్ నాన్న ఫేమ్ శౌర్యుతో ఎమోషనల్ సినిమాతో పలకరించనున్నారు. ఇలా సినిమా సినిమాకు వేరియేషన్ ఉండేలా చూస్తున్నారు విజయ్.
మెగాహీరోస్ డిఫరెంట్ అటెంప్ట్స్..
ఇక సంబరాల ఏటిగట్టుతో యాక్షన్ డ్రామా చేస్తున్న సాయి ధరమ్ తేజ్.. క ఫేమ్ సుజీత్-సందీప్ ద్వయంతో మిస్టిక్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాలో డిఫరెంట్ అటెంప్ట్ చేసే వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజుతో బాగానే నవ్వించారు. ప్రస్తుతం కమిటీ కుర్రోళ్లు ఫేమ్ యధు వంశీ దర్శకత్వంలో ఫుట్బాల్ స్పోర్ట్స్ డ్రామాతో గ్రౌండ్లోకి దిగిపోయారు. ఈ సినిమాకు ‘బరి’ అనే టైటిల్తో రాబోతున్నారు. మొత్తానికి మిడ్ రేంజ్ హీరోలు మూస కథలకు గుడ్బై చెప్పేసి.. ఎప్పటికప్పుడు డిఫరెంట్ జానర్స్ చేస్తున్నారు.