నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష రుతువు, దక్షిణాయనం, 2026 సెప్టెంబర్ 29 మంగళవారం, సంకటహర చతుర్థి. పండితుల ప్రకారం ఈ రోజు ఏయే కొత్త పనులు ప్రారంభించవచ్చో వివరంగా తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. ఆకస్మికంగా ధనలాభం కలిగే సూచన ఉంది. కుటుంబంలో సఖ్యత పెరిగి, ప్రశాంతంగా సాగిపోయే రోజు.
2/5
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరుల గొడవల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించండి.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది, శుభవార్త వింటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
4/5
తుల రాశి
తుల రాశి వారికి ఈరోజు శుభకరమే. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. దీనివల్ల మంచి ప్రశంసలతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి.
5/5
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల గొడవల్లో తలదూర్చకుండా చూసుకోవాలి, లేని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)