తిరుమలలో భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో, అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున, మీరు కూడా తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకుంటుంటే ఈ విషయాన్ని గమనించండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/5
తిరుమల తిరుపతి దేవస్థానం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. వీరు వివిధ రకాల టికెట్ల ద్వారా, అలాగే సర్వదర్శనం, ప్రోటోకాల్ దర్శనాల ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు.
2/5
బ్రేక్ దర్శనాల రద్దు
సాధారణంగా భక్తుల రద్దీని బట్టి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తుంటారు. అయితే, అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వరకు కూడా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 గురువారం నుండి అక్టోబర్ 5 సోమవారం వరకు, ప్రోటోకాల్, ప్రముఖులకు మినహా ఇతర వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు.
3/5
తిరుమల శ్రీవారి దర్శనం
ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనం కోసం 80 వేల మందికి పైగా భక్తులు వేచి ఉన్నారు. దర్శన క్రమంలో 30 వేల మంది భక్తులు మరుసటి రోజు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల సామాన్య భక్తులకు వేచి ఉండే సమయం పెరుగుతుంది కాబట్టి, సామాన్య భక్తుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నారు.
4/5
బ్రేక్ దర్శనం
అక్టోబర్ 1వ తేదీన బ్రేక్ దర్శనం రద్దు కాబట్టి, సెప్టెంబర్ 30 బుధవారం, అక్టోబర్ 4 ఆదివారం సిఫార్సు లేఖలను స్వీకరించరు. అధిక రద్దీ దృష్ట్యా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
5/5
తిరుమల
మరోవైపు, తిరుమలలో అక్టోబర్ 12 నుండి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అధికమాసం వచ్చినప్పుడు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 16న గరుడ వాహనం, 17న పుష్పక విమానం, అక్టోబర్ 19న చక్రస్నానం నిర్వహిస్తారు.