Tvs Apache Rtr 160: టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 ఆర్‌ఎమ్ డ్రమ్ బ్లాక్ ఎడిషన్ మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ అందుబాటులోకి తీసుకువచ్చాము.. కేవలం రూ.4000 రూపాయల బడ్జెట్‌తో ప్రతి నెల EMI ప్లాన్ చేసుకునే విధంగా ఈ ప్లానింగ్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Tvs Apache Rtr 160: భారతీయ మార్కెట్లో స్పోర్ట్స్ లుక్కుతో పాటు అద్భుతమైన ఇంజన్ పవర్ కోరుకునే యువతను ఆకర్షిస్తున్న మోటార్ సైకిల్స్‌లో TVS అపాచీ ఒకటి.. ఇది భారత మార్కెట్లో కంపెనీ ఎక్కువగా విక్రయిస్తున్న అద్భుతమైన మోటార్ సైకిల్స్ లో ముందు వరుసలో ఉంటుంది. ఇది చూడడానికి ప్రీమియం లుక్కులో చాలా అద్భుతంగా కనిపిస్తుంది.. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో ఈ మోటార్ సైకిల్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మీకోసమే..
1/5
యువతకు బెస్ట్ ఆప్షన్..
ఈ అపాచీ మోటార్ సైకిల్ ముఖ్యంగా కాలేజీ యువతకు బెస్ట్ ఆప్షన్ గా భావించవచ్చు. పవర్ఫుల్ పర్ఫామెన్స్ కోరుకునే వారికి ఈ బడ్జెట్ ప్లాన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా నెలకు సుమారు నాలుగువేల రూపాయలు మాత్రమే చెల్లించి ఇలాంటి అద్భుతమైన మోటార్ సైకిల్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా భావించవచ్చు..
2/5
లోన్ అమౌంట్..
ఈ మోటార్ సైకిల్ పై లోన్ అమౌంట్ మొత్తం రూ.1,07,955 అయితే.. దాదాపు 30 నెలల పాటు EMI ఆప్షన్ చూస్ చేసుకునేవారు అదనంగా రూ.16,185 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం అమౌంట్ రూ.1,24,140 అవుతుంది. అయితే, మోటార్ సైకిల్ కొనుగోలు చేసిన తర్వాత అదనంగా ఫిట్టింగ్ కోసం మరిన్ని చార్జెస్ కూడా ఉంటాయి.. వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది..
3/5
బ్యాంకు లోన్ అమౌంట్
తక్కువలో తక్కువ బ్యాంకు లోన్ అమౌంట్ పై ఆరు శాతం వడ్డీ రేటును నిర్ణయిస్తే.. లోన్ దాదాపు 30 నెలల వాటి చెల్లించే ఆప్షన్ ఎంపీగా చేసుకుంటే ప్రతినెల మీరు రూ.4,138 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు సుమారు రూ.140 ఖర్చవుతుంది. అంతేకాకుండా కొన్ని అదనపు చార్జీలు కూడా ఇందులో యాడ్ అవుతూ ఉంటాయి..
4/5
రూ.31,700 డౌన్ పేమెంట్..
ప్రస్తుతం చాలామంది ఈ మోటార్ సైకిల్‌కు కేవలం రూ.30 వేల లోపే డౌన్ పేమెంట్ కట్టేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. బడ్జెట్ ప్లానింగ్ ప్రకారం.. ఈ మోటార్ సైకిల్ కు రూ.31,700 డౌన్ పేమెంట్ చెల్లించి ఈ బైకును బుక్ చేసుకుంటే.. మిగతా డబ్బుల కోసం ఫైనాన్స్ కంపెనీలు దాదాపు రూ.1,07,955 బ్యాంకు లోన్ అందిస్తాయి.
5/5
అపాచీ ఆర్‌టీఆర్ 160 ఆర్‌ఎమ్
ముఖ్యంగా టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 ఆర్‌ఎమ్ డ్రమ్ బ్లాక్ ఎడిషన్ (TVS Apache RTR 160 RM Drum Black Edition) వేరియంట్‌కు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. అయితే, ఎక్కువగా యువత ఈ మోటార్ సైకిల్ ను ఫైనాన్సులో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. మీరు కూడా ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలు చేయాలనుకుంటే మీకోసం అద్భుతమైన బడ్జెట్ ప్లానింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..