హిందూ మతంలో తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకే అందరి ఇళ్లలో కూడా తులసి మొక్క ఉంటుంది. అయితే, కొంతమంది తులసి మొక్క పక్కనే కొన్ని వస్తువులు పెడతారు. అవి ఇంటికి అరిష్టాన్ని తీసుకువస్తాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/5
తులసి మొక్క
సాధారణంగానే తులసి మొక్క పక్కన ముళ్ల మొక్కలు పెట్టకూడదు. ఇది అశుభం. ఇవి ఆర్థిక నష్టాన్ని తీసుకువస్తాయి. లక్ష్మీదేవి అంటే శుభ్రంగా ఉన్న ప్రాంతంలోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటించాలి.
2/5
తులసి మొక్క వాస్తు చిట్కాలు
తులసి మొక్క పక్కనే కొంతమంది చెత్త బుట్టను కూడా పెడతారు. ఇది అశుభం. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క పక్కన ఇలాంటివి పెట్టకూడదు. లక్ష్మీ ఆకర్షించాలంటే తులసి మొక్క పెట్టిన ప్రాంతంలో పరిశుభ్రంగా ఉండాలి. దీంతో నెగిటివిటీ దూరం అవుతుంది.
3/5
తులసి మొక్క దగ్గర ఏమి ఉంచకూడదు
కొంతమంది తులసి మొక్క పక్కనే చెప్పులు, షూలను కూడా వదిలేస్తారు. అంతేకాదు దీని పక్కన షూ ర్యాక్ కూడా పెట్టకూడదు. మీ ఇంట్లోకి లక్ష్మీ దేవి రాకుండా ఆగిపోతుంది. ఇది ఆర్థిక నష్టానికి కూడా దారితీస్తుంది. కెరీర్‌లో అభివృద్ధి కూడా ఉండదు.
4/5
తులసి మొక్క ఆర్థిక కష్టాలు
మరో వస్తువు ఇంటిని శుభ్రం చేసి చీపురును కూడా తులసి మొక్క పక్కనే పడేస్తారు. ఇది కూడా ఆ ఇంటికి అశుభం.
5/5
తులసి పూజ వాస్తు రూల్స్
ఇక తులసి మొక్కను పూజిస్తాం. అదేవిధంగా శివలింగాన్ని కూడా పూజిస్తారు. అలా అని దాని పక్కనే పెట్టకూడదు. పురాణాల ప్రకారం తులసి మొక్క పక్కనే శివ లింగం పెట్టడం, శివుడికి తులసి ఆకులు సమర్పించడం కూడా నిషిద్ధం.