YS Jagan KTR And TVK Vijay Special Attraction At Wedding Ceremony: ఒక ఫొటో దక్షిణాది ప్రాంతంలో వైరల్‌గా మారింది. మూడు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువ నాయకులు ఒకే వేదికపై మెరవడంతో చర్చనీయాంశంగా మారింది. ఓ శుభకార్యంలో ఆ ముగ్గురు కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆ ముగ్గురే కేటీఆర్, వైఎస్ జగన్, టీవీకే విజయ్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
1/7
ysjaganktrvijay
రాజకీయంగా కాకుండా కేటీఆర్, జగన్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. పరస్పరం అన్నదమ్ముళ్లుగా వ్యవహరించుకుంటున్నారు. గతంలో బీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ ఇరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉంది. అధికారం కోల్పోయినా కూడా వీరి మధ్య అనుబంధం ఏమీ తగ్గలేదు.
2/7
ktrysjagan
ఈ వేడుకలో టీవీకే విజయ్, వైఎస్ జగన్, కేటీఆర్ ముగ్గురు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. విజయ్, జగన్, కేటీఆర్ ఆప్యాయంగా మాట్లాడుకుని.. సరదాగా నవ్వుకుంటూ కనిపించారు. విజయ్, జగన్‌తో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు.
3/7
ysjaganvijay
ఈ వివాహ వేడుకలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంచు మోహన్ బాబు, సినీ నటి త్రిషతోపాటు పలువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
4/7
ysjaganvijayamma
తమ కుటుంబసభ్యులతో వైఎస్ జగన్ దంపతులు కలివిడిగా ఉన్నారు. వైఎస్ భారతి, జగన్ దంపతులు తమ బంధుమిత్రులతో సరదాగా గడిపారు. చాలా రోజుల తర్వాత వైఎస్ కుటుంబసభ్యులంతా ఒకే చోటకు చేరడంతో సందడి నెలకొంది.
5/7
ysanilreddydaughterwedding
తమ కుటుంబ వివాహ వేడుక కావడంతో వైఎస్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. నూతన వధూవరులు శ్రేయ–ఉజ్వల్‌లను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, భారతి దంపతులు ఆశీర్వదించారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా జగన్ నిలిచారు. వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు.
6/7
ysjaganinmarriage
తమిళనాడులోని చెన్నైలో ఉన్న లీలా ప్యాలెస్ హోటల్‌లో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం ఉజ్వల్‌తో గురువారం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దేశంలోని ప్రముఖులు తరలివచ్చారు. సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు తరలిరావడంతో సందడి నెలకొంది.
7/7
ysanilreddydaughtermarriage
మూడు వేర్వేరు రాష్ట్రాల యువ నాయకులు.. రాజకీయంగా కీలకంగా ఉన్న నాయకులు ఒకే వేదికపై కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకుని ముగ్గురు ఒకే చోట కనిపించడంతో దక్షిణాది ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వివాహ వేడుక దీనికి వేదికగా మారింది.