• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /YS Anjali Reddy: వైభవంగా వైఎస్‌ అంజలి రెడ్డి-రఘురామ్‌ రెడ్డి వివాహం.. పిక్స్‌ వైరల్

YS Anjali Reddy: వైభవంగా వైఎస్‌ అంజలి రెడ్డి-రఘురామ్‌ రెడ్డి వివాహం.. పిక్స్‌ వైరల్

Written By Ravi Kumar Sargam
Published: Nov 26, 2026, 15:58 IST|Updated: Nov 26, 2026, 16:20 IST
joinshare
YS Anjali Reddy Raghuram Reddy Grand Wedding Photos: వైఎస్‌ కుటుంబంలో మరో వివాహ వేడుక జరిగింది. దివంగత వైఎస్సార్‌ మనవరాలు, వైఎస్‌ షర్మిల కుమార్తె వైఎస్‌ అంజలి రెడ్డి వివాహం వైభవంగా జరగ్గా.. ఈ వేడుకకు కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యరు. తన బిడ్డ వివాహానికి సంబంధించిన ఫొటోలను షర్మిల పంచుకున్నారు.

YS Anjali Reddy Raghuram Reddy Grand Wedding Photos: వైఎస్‌ కుటుంబంలో మరో వివాహ వేడుక జరిగింది. దివంగత వైఎస్సార్‌ మనవరాలు, వైఎస్‌ షర్మిల కుమార్తె వైఎస్‌ అంజలి రెడ్డి వివాహం వైభవంగా జరగ్గా.. ఈ వేడుకకు కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యరు. తన బిడ్డ వివాహానికి సంబంధించిన ఫొటోలను షర్మిల పంచుకున్నారు.

YS Anjali Reddy Wedding1/8

YS Anjali Reddy Wedding

కాగా అంజలి రెడ్డి వివాహం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ముందుగా బెంగళూరులోని యలహంకలో ఉన్న ప్యాలెస్‌లో అంజలి రెడ్డి వివాహం చేయాలని నిశ్చయించగా.. ఆమె సోదరుడు, అంజలి మేనమామ అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లి చేయొద్దని చెప్పడంతో తీవ్ర దుమారం రేపింది. ఇక చేసేది లేక వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహాన్ని వేరే చోటకు మార్చారు.
YS Anjali Reddy Marriage2/8

YS Anjali Reddy Marriage

'కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అంజిలీ, రఘులకు ఆ దేవుడి శుభాశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు' అని వైఎస్‌ షర్మిల సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.
YS Sharmila Family3/8

YS Sharmila Family

'నాన్న వైఎస్‌ దీవెనలతో, అమ్మ (వైఎస్‌ విజయమ్మ) ఆశీస్సుల మధ్య, కుటుంబసభ్యులు, ఆత్మీయుల సమక్షంలో నా బిడ్డ వైఎస్ అంజిలీ రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డి వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది' అని వైఎస్‌ షర్మిల ప్రకటించారు.
YS Anjali Reddy Vijayamma4/8

YS Anjali Reddy Vijayamma

తన కుమార్తె అంజలి రెడ్డి వివాహంపై వైఎస్‌ షర్మిల సోషల్‌ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అంజలి-రఘురామ్‌ వివాహానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.
YS Anjali Reddy Raghuram Reddy Wedding5/8

YS Anjali Reddy Raghuram Reddy Wedding

ఈ వివాహానికి అతి కొద్ది మంది బంధుమిత్రులు, వైఎస్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. సన్నిహితుల సమక్షంలో ఆ ఇద్దరు ఒక్కటయ్యారు. అంజలి, రఘురామ్‌ జంటను వైఎస్‌ కుటుంబసభ్యులతోపాటు హాజరైన అతిథులు ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు.
YS Anjali Reddy Raghuram Reddy6/8

YS Anjali Reddy Raghuram Reddy

బెంగళూరులోని నందిహిల్స్‌ సమీపంలో ఉన్న మనధీర రిసార్టులో బుధవారం సాయంత్రం వైఎస్‌ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం క్రైస్తవ పద్ధతిలో జరిగింది. బ్రదర్‌ అనిల్‌ కుమార్‌- వైఎస్‌ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి రఘురామ్‌ రెడ్డితో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
Raghu Ramreddy YS Anjalireddy7/8

Raghu Ramreddy YS Anjalireddy

కర్నూలుకు చెందిన రఘురామ్‌ రెడ్డితో వైఎస్‌ అంజలి రెడ్డికి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. విదేశాల్లో రఘురామ్‌ రెడ్డి వైద్యుడిగా కొనసాగుతున్నారు. వీరిద్దరి నిశ్చాతర్థ వేడుక కొన్ని వారాల కిందట హైదరాబాద్‌లో నిర్వహించారు. పెళ్లి నవంబర్‌ 25వ తేదీన జరిపించారు.
YS Anjali Reddy Raghuram Reddy Marriage8/8

YS Anjali Reddy Raghuram Reddy Marriage

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రాజకీయ కుటుంబం వైఎస్‌ కుటుంబానిది. ఈ కుటుంబంలో మరో వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం బెంగళూరులో జరగ్గా.. కొద్ది మంది సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యారు. తన బిడ్డ అంజలి వివాహానికి సంబంధించిన ఫొటోలు వైఎస్‌ షర్మిల పంచుకున్నారు.
TAGS:
Congress
Telugu News
Trending News
AP News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
నిద్రపోయే ముందు నెగిటివ్ న్యూస్ చూస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

నిద్రపోయే ముందు నెగిటివ్ న్యూస్ చూస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

2

Tamil Nadu 15 Days Paternity Leave: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఆ రాష్ట్రంలో పురుషులకు 15 రోజులు పితృత్వ సెలవులు!

3

Somu Veerraju: దమ్ముంటే రండి చూసుకుందాం.. రెండు తొడలు కొట్టి వైసీపీ నేతలకు సోము వీర్రాజు సవాల్.. వీడియో..

4

Netflix Pakistani Series Controversy: నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్.. భారత్‌లో పాక్ కంటెంట్ ప్రసారం చేస్తే చర్యలే!

5

నిద్రపోవాలన్నా నిద్ర రావడం లేదా? స్లీప్ యాంగ్జైటీతో బాధపడేవారి బెస్ట్ టిప్స్‌!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.