• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /నిద్రపోవాలన్నా నిద్ర రావడం లేదా? స్లీప్ యాంగ్జైటీతో బాధపడేవారి బెస్ట్ టిప్స్‌!

నిద్రపోవాలన్నా నిద్ర రావడం లేదా? స్లీప్ యాంగ్జైటీతో బాధపడేవారి బెస్ట్ టిప్స్‌!

Sleep Anxiety: ప్రస్తుతం చాలా మంది స్లీప్ యాంగ్జైటీతో బాధపడుతున్నారు. దీని కారణంగా నిద్రలేక అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, ఇలాంటి సమస్యలున్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఈ కింది జాగ్రత్తలు పాటించాలని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ వెల్లడించారు..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 26, 2026, 15:47 IST|Updated: Nov 26, 2026, 15:50 IST
joinshare
నిద్రపోవాలన్నా నిద్ర రావడం లేదా? స్లీప్ యాంగ్జైటీతో బాధపడేవారి బెస్ట్ టిప్స్‌!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Netflix Pakistani Series Controversy: నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్.. భారత్‌లో పాక్ కంటెంట్ ప్రసారం చేస్తే చర్యలే!

Netflix Pakistani Series Controversy: నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్.. భారత్‌లో పాక్ కంటెంట్ ప్రసారం చేస్తే చర్యలే!

2

నిద్రపోవాలన్నా నిద్ర రావడం లేదా? స్లీప్ యాంగ్జైటీతో బాధపడేవారి బెస్ట్ టిప్స్‌!

3

మీ లివర్‌ను ఉక్కులా మార్చే 5 అద్భుతమైన దుంప కూరగాయలు.. వీటిని తింటే ఫ్యాటీ లివర్ పరార్!

4

Adilabad: ప్రేమిస్తే చంపేస్తారా..?.. తెలంగాణలో మరో పరువు హత్య కలకలం.. నిద్రలో ఉన్న కూతురి గొంతు పిసికి మరీ.!.

5

Vivo X500 వచ్చేసింది.. AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, అదిరిపోయే ఫీచర్లు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sleep Anxiety: రోజంతా కష్టపడి పనిచేసి.. అలసిపోయి బెడ్‌పైకి చేరినా కంటి మీద కునుకు పట్టడం లేదా? గడియారం ముల్లు అర్ధరాత్రి దాటుతున్నా నిద్ర రాక అటూ ఇటూ దొర్లుతున్నారా? అయితే, మీ నిద్రలేమికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, స్లీప్ యాంగ్జైటీ అయ్యి ఉండొచ్చని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ తెలిపారు.. ఆధునిక జీవనశైలిలో నిద్రలేమి, మానసిక ఆందోళన ఒకదానికొకటి విపరీతంగా పెరిగిపోయి.. మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన వెల్లడించారు.

మనం ఒత్తిడికి, ఆందోళనకు గురైనప్పుడు.. మన మెదడు దానిని ఏదో ప్రమాదంగా భావిస్తుందని.. ఫలితంగా శరీరంలో  కార్టిసాల్, అడ్రినలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ వెల్లడించారు. ఇవి గుండె వేగాన్ని పెంచి.. మెదడును అత్యంత అప్రమత్తంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. శరీరం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఇలా అప్రమత్తంగా ఉండటం వల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది. ఇక  నాకు ఈరోజు కూడా నిద్ర పట్టదేమో.. రేపు ఆఫీసులో పని ఎలా చేయాలి? అనే భయం మొదలైనప్పుడు అది కాస్తా  స్లీప్ యాంగ్జైటీగా మారుతుందని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ అన్నారు. ఇది ఒక సర్కిల్‌లా మారి నిద్రను మరింత దూరం చేస్తుందని ఆయన అన్నారు.

స్లీప్ యాంగ్జైటీని ఇలా చెక్‌ పెట్టండి!
ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడంతో పాటు ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుందని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ తెలిపారు. దీనివల్ల శరీరంలోని బయోలాజికల్ క్లాక్ సక్రమంగా పనిచేస్తుందన్నారు. నిద్రపోవడానికి కనీసం గంట ముందు మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, టీవీలకు దూరంగా కూడా ఉండాల్సి ఉంటుంది. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు ఆటంకం కలిగించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

నిద్ర పట్టనప్పుడు పదేపదే సమయం చూసుకోవడం వల్ల ఆందోళన మరింత పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ తెలిపారు. కాబట్టి గడియారాన్ని లేదా ఫోన్‌ను మీ కంటికి కనిపించకుండా దూరంగా ఉంచుకోవడం చాలా మేలు. పడకగది నిశ్శబ్దంగా, చీకటిగా, చల్లగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా మనసుకు నచ్చిన పుస్తకం చదవడం వల్ల మెదడు ప్రశాంతంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

బెడ్‌పై పడుకున్న తర్వాత కళ్లు మూసుకుని.. డీప్ బ్రీతింగ్ లేదా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి త్వరగా నిద్ర పడుతుందని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ ప్రదీప్‌ వెల్లడించారు. నిద్ర అనేది శరీరానికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం.. ఆందోళనను పక్కన పెట్టి.. జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే స్లీప్ యాంగ్జైటీని సులభంగా జయించి.. మరుసటి రోజును ఎంతో ఉత్సాహంగా మొదలు పెట్టొచని మెంటల్‌ హెల్త్‌ కోచ్‌ తెలిపారు. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూదని ప్రదీప్‌ తెలిపారు..


సేకరణ: మెంటల్‌ హెల్త్ కోచ్‌ ప్రదీప్‌

అనుభవం: 6 సంవత్సరాలు
ఈ మెయిల్‌ ఐడీ: Pradeeptalks90@gmail.com

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News