SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Pydithalli Sirimanu: 350 ఏళ్ల చారిత్రక.. ఆధ్యాత్మిక ఉత్సవం విజయనగర పైడితల్లి సిరిమాను

350 Years Historical And Spiritual Background To Pydithalli Ammavari Sirimanu Utsav: ఏపీలో అత్యంత వైభవంగా జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి వేళయ్యింది. దసరా పండుగ తర్వాత వచ్చే మొదటి మంగళవారం విజయనగరంలో జరిగే ఈ ఉత్సవానికి అత్యంత చారిత్రక నేపథ్యంతోపాటు ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 24, 2026, 10:54 PM IST | Updated: Oct 24, 2026, 10:58 PM IST
Image Credit: Source: X (Twitter)
Join

Pydithalli Ammavari Sirimanu Utsavam: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారికి కొన్ని దశాబ్దాల చారిత్రక ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. పైడితల్లి అమ్మవారికి పుట్టిల్లు అయిన విజయనగరం కళలకు కాణాచిగా పేరుగాంచింది. విద్యులనగరంగా సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన విజయనగరం ఏర్పాటులోనే విజయాల పరంపర అంతర్లీనమై ఉంది. విజయనగరం పేరు చెప్పగానే బొంకుల దిబ్బ, గంట స్తంభం, పెద్ద చెరువు, మూడు లాంతర్లు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. మహాకవి గురజాడ అప్పారావు విరచితమైన కన్యాశుల్కం నాటకం బొంకుల దెబ్బ నుంచి ప్రారంభమవుతుంది. కోట వెనుక భాగంలోని పెద్ద చెరువుకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ చెరువు తవ్విన మట్టితోనే కోట నిర్మాణం జరిగిందనేది చారిత్రక కథనం. 

అప్పట్లో మూడు లాంతర్ల కూడలి కీలకమైనది. సాయంత్రమయ్యేసరికి ఒకటి కోట దగ్గర రెండు మూడు లాంతర్లు విజయనగరానికి వెలుగు దివ్వెలుగా ఉండేవి. అయితే ప్రస్తుతం ఆ ప్రాచీన మూడు లాంతర్లు లేవు గాని వాటి స్థానంలో వాటి రూపాలను ఏర్పాటు చేశారు. సుమారు 350 సంవత్సరాల ప్రాచీనత కలిగిన విజయనగరం నాటికి నేటికి ఒక కళా వైభవ రాజధానిగా వెలుగొందుతూనే ఉంది. మహారాజులు స్థాపించిన సాంస్కృత కళాశాల సంగీతం నృత్య కళాశాల నేటికీ ఉన్నాయి. నాటి విజయనగర వైభవానికి ఈ కళాశాలలో సజీవ సాక్షాలుగా నిలిచాయి. విజయనగరం రాజుల కళాపోషణ సాహితీ సేవ అనన్యం. విద్యా వ్యాప్తి కోసం ప్రత్యేకంగా ఒక కళాశాలనే ఏర్పాటు చేశారు. అందుకే విజయనగరం విధ్య లనగరం అయింది. విజయనగరానికి విజయనగరం మహారాజులకి శ్రీ పైడితల్లి అమ్మవారి సాక్షాత్కారానికి ఒక చారిత్రక ఆధ్యాత్మిక నేపథ్యమే ఉంది. అందుకే శ్రీ పైడితల్లి సిరిమాను సంబరాలు విజయనగరం పండుగగా నిర్వహిస్తారు.

అమ్మవారి చారిత్రక కథ
శ్రీ పైడితల్లి అమ్మవారి ఆవిర్భావానికి బొబ్బిలి యుద్ధానికి అవినాభావ సంబంధం ఉంది. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం నేపథ్యంలోని పైడితల్లి అమ్మవారు వెలిశారు. అప్పటి విజయనగరం రాజు విజయరామ గజపతి ఫ్రెంచ్ సైన్యం సహాయంతో బొబ్బిలి కోటపై దాడి చేశారు. బొబ్బిలి యుద్ధం లో బొబ్బిలి రాజులు ఓడిపోయారు. ఆ సమయానికి అక్కడ లేని తాండ్ర పాపారాయుడు ఇది తెలుసుకొని అక్కడే యుద్ధ శిబిరంలో నిద్రిస్తున్న విజయరామ గజపతి రాజుని హతమార్చారు. అయితే రాజు సోదరి అయిన పైడితల్లి అమ్మవారు యుద్ధాన్ని వ్యతిరేకించారు. శాంతిని ఉద్భోదించారు. 

భవిష్యత్తును ముందుగా పసిగట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే యుద్ధం ప్రారంభమైంది. దానిని ఆపేందుకు రథంలో బయలుదేరిన చిరు పైడితల్లి అమ్మవారికి మధ్యలోనే మరణ వార్త తెలిసింది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ప్రాంతం అప్పుడు పెద్ద అడవి. అక్కడే అమ్మవారు పెద్ద చెరువులో దేవిలో లీనమయ్యారు. రథాన్ని నడిపిన సారథి వంశమే నేటికీ కూడా సిరిమానును అధిరోహిస్తూ ఉంటుంది. పెద్ద చెరువులో దొరికిన అమ్మవారి విగ్రహాన్ని తొలుత రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న వనం గుడిలో ప్రతిష్టించారు. ఆ తర్వాత మూడు లాంతర్ల వద్ద చదురు గుడి నిర్మాణం జరిగింది. ఆరు నెలల వ్యవధిలో అమ్మవారు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తరలి వెళుతుంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం చదురు గుడిలో ఉన్నటువంటి అమ్మవారికి ప్రతి ఏడాది దసరా తర్వాతి మంగళవారం సినిమాను రథయాత్ర నిర్వహిస్తారు.

ఆడపడుచుల వైభవం
పైడితల్లి అమ్మవారి సినిమాను సంబరాలు అంటే విజయనగరం ఆడపడుచుల వైభవం. ఎందుకంటే అమ్మవారు విజయనగరం మహారాజుల ఆడపడుచు. ఈ కారణంగానే సినిమాను రథపీఠంపై అనువంశిక పూజారి ఆసీనులై కూర్చుంటే.. ఆరాధన మూడు లాంతర్ల నుంచి కోట వరకు మూడుసార్లు తిరుగుతుంది. కోట ప్రధాన బురుజుపై కూర్చుని ఉండే మహారాజులను ఆశీర్వదిస్తుంది. ఈ కారణంగానే ఆరోజు మాత్రమం మహారాజులు ఎంతటి పని ఉన్న వదులుకొని విజయనగరం వస్తారు. ఇది విజయనగరం ఆడపడుచుల పండుగ కావడంతో ఎక్కడెక్కడ నుంచో విజయనగరంలో పుట్టి పెరిగిన ఆడపిల్లలు తమ కుటుంబాలతో సహా విజయనగరం వస్తారు. అమ్మవారి సినిమాను రథయాత్రలో పాల్గొంటారు. పండుగ చేసుకుని అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని మళ్లీ అత్తవారిళ్లకు వెళతారు. ఈ పండుగలో తోలేళ్ల ఉత్సవం సిరిమాను రథయాత్ర ప్రధానమైనవి. ముందు రోజు సోమవారం తొలేళ్ల ఉత్సవం జరిగితే.. తర్వాతి రోజు మంగళవారం సిరిమాను రథయాత్ర నిర్వహిస్తారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES