Lord Shani Blessings 4 Lucky Zodiac Signs: శని దేవుడిని న్యాయానికి అధిపతిగా సూచిస్తూ ఉంటారు. నవగ్రహాలలో ఈయన కూడా ఒక గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ శని గ్రహం మనుషులు చేసే కర్మలను అనుగుణంగానే ఫలితాలను అందిస్తూ ఉంటాడు. శని దేవుడు అనుగ్రహం ఉంటే జీవితంలో అనేక అడ్డంకులు సులభంగా తొలగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా అద్భుతమైన విజయాలు శ్రేయస్సు కూడా లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏలినాటి శనితో పాటు అర్ధాష్టమి శని వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు నష్టాలు కలిగినప్పటికీ.. అయితే నాలుగు రాశుల వారికి మాత్రం ఎల్లప్పుడూ శని అనుగ్రహం ఉంటూనే ఉంటుంది. వీరు అనుకున్న లాభాలు పొందడమే కాకుండా.. కష్టపడి పని చేయడం కారణంగా సులభంగా విజయాలు పొందగలుగుతారు.
ఈ రాశులవారికి శని మేలు..
మకర రాశి
శని దేవుడికి అత్యంత ఇష్టమైన రాశుల్లో మకర రాశి ఒకటి. ఎందుకంటే ఈ రాశికి శని అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అందువల్ల మకర రాశిలో జన్మించిన వారికి పనిచేసే తత్వంతో పాటు క్రమశిక్షణ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి శని పరీక్షిస్తూ ఉంటాడు వారు ఆ పరీక్షల్లో నెగ్గితే అద్భుతమైన విజయాలు కలుగుతాయి. అపారమైన ధన లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వారు జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూడని ప్రయోజనాలను కూడా పొందుతారు. పనిలో విజయాలు సాధించడమే కాకుండా పురోగతి కూడా విపరీతంగా లభిస్తుంది. శని సానుకూల ప్రభావంతో జీవితంలో అడ్డంకులు లేకుండా ముందుకెళ్తూ ఉంటారు.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.. శనికి కూడా ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి ఒకటి అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు వృత్తిపరంగా ఎప్పుడు అద్భుతమైన విజయాలు కలుగుతూ ఉంటాయి.. శ్రేయస్సు కూడా విపరీతంగా లభిస్తుంది ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు గౌరవం లభించి.. స్థానాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. అనుకోకుండా అద్భుతమైన ధన లాభాలు కూడా సొంతం చేసుకోగలుగుతారు.
తులారాశి
తులారాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శని అద్భుతమైన అనుగ్రహాన్ని అందిస్తాడని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శుక్ర, శని గ్రహాల మధ్య అద్భుతమైన స్నేహపూర్వక సంబంధం ఉంటుంది. ఈ రాశిని శుక్రుడు పరిపాలించినప్పటికీ.. శని అనుగ్రహంతో వీరు వ్యాపారాల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా జీవితంలో నిజాయితీగా ఉంటే డబ్బులకు ఎలాంటి కొరత ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పెద్ద సమస్యల నుంచి కూడా వీరికి సులభంగా ఉపశమనం కలుగుతూ ఉంటుంది.
కుంభరాశి
కుంభరాశి వారికి కూడా ఎల్లప్పుడు శని అనుగ్రహం లభిస్తూ ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. వీరికి అధిపతిగా శనే వ్యవహరిస్తాడు. కాబట్టి వీరు కష్టపడి పనులు చేయడం కారణంగా ఊహించని విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా వీరి జీవితంలోనూ అద్భుతమైన ధన లాభాలు సొంతం చేసుకుంటారు. సంపాదనతో పాటు శ్రేయస్సును కూడా పొంది అంచలంచెలుగా ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి పనులు చేసిన మంచి లాభాలు సొంతం చేసుకోగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
NOTE: