• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /రేషన్ షాపులో భారీ నాగుపాము.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్!

రేషన్ షాపులో భారీ నాగుపాము.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్!

Cobra Rescued From Ration Shop: వేములవాడలోని అర్బన్ మండల పరిధిలో ఉన్న ఓ రేషన్ షాపులు నాగుపాము దర్శనమిచ్చింది. అయితే, దీనిని జగదీష్ అనే ఒక స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుకున్న పామును అడవి ప్రాంతంలో వదిలిపెట్టినట్లు ఆయన తెలిపారు.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 08, 2026, 09:34 AM IST|Updated: Nov 08, 2026, 09:35 AM IST
joinshare
రేషన్ షాపులో భారీ నాగుపాము.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Diwali Significance: దీపావళి రోజున ఈ పొరపాటు అస్సలు చేయకండి! నకర చతుర్దశి నాడు అసలైన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

Diwali Significance: దీపావళి రోజున ఈ పొరపాటు అస్సలు చేయకండి! నకర చతుర్దశి నాడు అసలైన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

2

దీపావళి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..!!

3

రేషన్ షాపులో భారీ నాగుపాము.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్!

4

నేటి నుంచే తెలంగాణలో కొత్త పింఛన్ల పంపిణీ..కొడంగల్‌లో సీఎం చేతుల మీదుగా ప్రారంభం..!!

5

Israel Political News: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మలుపు.. నెతన్యాహును అవుట్..కొత్త ప్రధానికి అధ్యక్షుడి ఆహ్వానం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cobra Rescued From Ration Shop: నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ఓ ప్రభుత్వ రేషన్ దుకాణంలో భారీ నాగుపాము ప్రత్యక్షమై తీవ్ర ఆందోళనకు గురిచేసింది.. వేములవాడ అర్బన్ మండల పరిధిలోని చింతల్తానా గ్రామంలో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది రేషన్ బియ్యం నిల్వ ఉంచిన గదిలో అత్యంత ప్రమాదకరమైన కోడెనాగు దర్శనం ఇవ్వడంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారట. అసలు ఆ పాము అక్కడికి ఎలా వచ్చింది? అక్కడ ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రామంలోని ప్రభుత్వ రేషన్ దుకాణాన్ని రోజులాగే తెరిచిన సమయంలో.. సరుకులు నిలువ ఉంచిన సమీపంలో కదలికలు కనిపించాయి.. అనుమానం వచ్చి పరిశీలించగా.. అక్కడ బుసలు కొడుతూ నక్కిన ఒక భారీ నాగుపాము కనిపించింది. విషయం తెలుసుకున్న వెంటనే రేషన్ కోసం అక్కడికి వచ్చిన వినియోగదారులు భయంతో పరుగులు తీశారు. అయితే వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ పామును అక్కడి నుంచి తరిమేసేందుకు ప్రయత్నించారు. కానీ అది అక్కడి నుంచి వెళ్లిపోకపోవడంతో స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు..

గ్రామస్తులు తక్షణమే స్థానిక స్నేక్యాచార్ జగదీష్ కు సమాచారం అందించగా వెంటనే ఆయన అక్కడికి చేరుకున్నారు ఘటనా స్థలానికి చేరుకొని బియ్య బస్తాల్లో నక్కి ఉన్న నాగుపామును గుర్తించి.. ఆ పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ పామును పట్టుకునే క్రమంలో స్నేక్ క్యాచర్ పై పలుసార్లు దాడి చేసే ప్రయత్నం కూడా చేసింది. కానీ అతను ఎంతో నైపుణ్యం కలిగి ఉండడంతో దాడి నుంచి తప్పించుకొని చాకచక్యంగా పామును రెస్క్యూ చేశాడు. అంతేకాకుండా ఆ పాము అతని వెంట తీసుకువచ్చిన ఒక డబ్బాలో బంధించి అక్కడి నుంచి తరలించాడు. దీంతో రేషన్ షాప్ కి వచ్చిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు..

పామును పట్టుకున్న అనంతరం జగదీష్ మాట్లాడుతూ.. పాములు చలికాలంలో ఎక్కువగా ఆహారంతో పాటు వెచ్చదనం కోసం తరచుగా ఇలాంటి గోదాముల్లోకి.. బస్తాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి వచ్చి అందులో నక్కుతాయని తెలిపారు.. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని.. పట్టుకున్న ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారని వెల్లడించారు.. పాముతో పాటు అక్కడికి వచ్చిన వారికి ఎలాంటి నష్టం కలగకుండానే దానిని పట్టుకున్నారని అతను తెలిపారు. ఇప్పుడు ఈ పాము కు సంబంధించిన వీడియో, అతను రిస్క్యూ చేస్తున్న సందర్భంలో తీసిన షార్ట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News