ఇంట్లో ఇత్తడి తాబేలును ఎందుకు ఉంచాలి? ధన ప్రాప్తికి, విజయానికి 5 శక్తివంతమైన కారణాలు ఇవే!
వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లోకి శుభకరంగా భావిస్తారు.. వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంటిలో శుభం, సుఖం, శాంతి వెల్లివిరియడమే కాకుండా కొత్త అవకాశాలు కూడా అందివస్తాయని నమ్ముతారు. అయితే చాలామంది ఇంట్లో తాబేలును ఉంచుకుంటారు. వాస్తు ప్రకారం దీన్ని ఉంచుకోవడం వల్ల ఐదు ప్రధాన ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Brass Vastu Turtle at Home: చాలామంది ఇళ్లలో చిన్న ఇత్తడి తాబేలును ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అత్యంత శుభకరమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లో, పూజ గదిలో కూడా దీన్ని ప్రతిష్టించుకుంటారు. దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి, కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి ఉంటారు, కుటుంబంలో సఖ్యత మరింత పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ విజయాన్ని అందుకుంటారని నమ్ముతారు. మీరు కూడా వాస్తు ప్రకారం తాబేలును ఏర్పాటు చేసుకుంటే కలిగే ఐదు ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
ఆర్థికంగా ఎదుగుదల..
వాస్తు ప్రకారం ఇంట్లో తాబేలు ప్రతిమను ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. దీంతో విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుందని భావిస్తారు. అందుకే చాలామంది తమ ఇళ్లలో దీన్ని ఏర్పాటు చేసుకుంటారు. సానుకూల శక్తి లభించడంతో కొత్త అవకాశాలు కూడా అందివస్తాయి, ఆర్థికంగా కూడా కలిసివస్తుంది, కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.
సానుకూలత పెరుగుదల..
సాధారణంగా తాబేలు విష్ణుమూర్తి అవతారమైన కూర్మావతారంగా భావించబడుతుంది. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి ఇంట్లో ప్రసరిస్తుంది. కుటుంబంపై ఎలాంటి చెడు దృష్టి పడకుండా ఇది రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు. ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది, ఇంటి వాతావరణం మరింత సానుకూలంగా మారుతుంది. ఇంట్లో తాబేలు ఉండటం వల్ల ఆర్థికంగా లాభాలు కలుగుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, విజయం కూడా లభిస్తుంది.
కెరీర్‌లో విజయం..
ఈ తాబేలును ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. కెరీర్ పరంగా చాలాకాలంగా ముందుకు సాగలేకపోతున్నవారికి మంచి శక్తి లభిస్తుంది, అభివృద్ధికి దారితీస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా చేస్తుంది.
మంచి ఆరోగ్యం..
వాస్తు ప్రకారం ఇంట్లో ఇత్తడి తాబేలును ఉంచుకోవడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని భావిస్తారు. తరచూ రోగాల బారిన పడకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ఇది కాపాడుతుంది. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఆర్థిక స్థిరత్వం..
ఇంట్లో ఇత్తడి తాబేలును ఉంచుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి, ఇంట్లోని వ్యక్తులు చురుకుగా ఉంటారు, ఆర్థికంగా ఎదుగుతారు.
వాస్తు దోష నివారణ
ఇంట్లో తాబేలును ఉంచుకోవడం వల్ల ఏవైనా వాస్తు దోషాలుంటే అవి కూడా తొలగిపోతాయని నమ్ముతారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి, దీంతో ఆర్థికంగా ఎదుగుతూ, ఆరోగ్యంగా ఉంటూ విజయాన్ని సాధిస్తారు. కాబట్టి వాస్తు ప్రకారం ఈ తాబేలును ఏర్పాటు చేసుకోవడం శుభకరమని చెప్పవచ్చు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)