• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /భారతీయులపై మళ్లీ ద్వేషం.. యూఎస్‌లో దీపావళి వేడుకలు జరుపుకుంటుండగా ప్లకార్డులతో రెచ్చిపోయిన ట్రంప్ మద్దతుదారులు!

భారతీయులపై మళ్లీ ద్వేషం.. యూఎస్‌లో దీపావళి వేడుకలు జరుపుకుంటుండగా ప్లకార్డులతో రెచ్చిపోయిన ట్రంప్ మద్దతుదారులు!

ఇండియన్ దీపావళి వేడుకలు జరుగుతున్న సమయంలో ట్రంప్ మద్దతుదారులు సీయటిల్‌లో అడ్డుకున్నారు. వేడుకలు కొనసాగుతుండగా ఇద్దరు లోపలికి దూసుకొచ్చి ప్లకార్డులతో నిరసన తెలిపారు. "క్రిస్టియన్ యూఎస్‌ను హిందువులు ఆక్రమిస్తున్నారు, వారిని దేశం నుంచి వెళ్లగొట్టండి" అని నినాదాలు చేశారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 08, 2026, 08:43 PM IST|Updated: Nov 08, 2026, 08:50 PM IST
joinshare
భారతీయులపై మళ్లీ ద్వేషం.. యూఎస్‌లో దీపావళి వేడుకలు జరుపుకుంటుండగా ప్లకార్డులతో రెచ్చిపోయిన ట్రంప్ మద్దతుదారులు!
Image Credit: Donald trump Supporters Disrupt Diwali

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Samantha: పెళ్లి తర్వాత సమంత డైట్ సీక్రెట్స్..హెల్తీ లైఫ్ కోసం 7 సింపుల్ టిప్స్!

Samantha: పెళ్లి తర్వాత సమంత డైట్ సీక్రెట్స్..హెల్తీ లైఫ్ కోసం 7 సింపుల్ టిప్స్!

2

దీపావళి వేడుకల్లో చెయ్యి కాలితే ఫస్ట్ ఎయిడ్ ఏంటి? ఈ 5 నిమిషాల చిట్కా మీ చర్మాన్ని కాపాడుతుంది!

3

మైదానంలోనే కాదు సంపదలోనూ కింగ్ కోహ్లీనే! విరాట్ నెట్ వర్త్ చూస్తే మైండ్ బ్లాంకే!

4

భారతీయులపై మళ్లీ ద్వేషం.. యూఎస్‌లో దీపావళి వేడుకలు జరుపుకుంటుండగా ప్లకార్డులతో రెచ్చిపోయిన ట్రంప్ మద్దతుదారులు!

5

ఏపీ రాజకీయంలో సంచలనం.. నవంబర్ 11న విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సంచలన ప్రకటన.. అసలు కారణాలు ఇవే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Donald trump Supporters Disrupt Diwali: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి హిందువులే కారణమని ఆయన మద్ధతుదారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీయటిల్‌లో భారతీయులు దీపావళి వేడుకలు జరుపుతున్న సమయంలో చొచ్చుకు వచ్చిన ఇద్దరు ట్రంప్ మద్దతుదారులు వారిని అడ్డుకున్నారు. అక్కడ ప్రదర్శించిన ప్లకార్డులలో "క్రిస్టియన్ హిందువులు ఆక్రమిస్తున్నారు, వారిని వెళ్లగొట్టండి" అని రాసి ఉంది.

అమెరికాలోని సీయాటిల్‌లో దీపావళి వేడుకలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆ సమయంలోనే కొందరు అమెరికన్లు మరోసారి జాత్యాహంకారాన్ని ప్రదర్శించారు. దీనిని అమెరికన్ చట్టసభ సభ్యులతో పాటు సామాజిక నాయకులు కూడా తీవ్రంగా ఖండించారు. శనివారం జరిగిన ఈ నృత్య ప్రదర్శనలో 'తిలకం ధరించిన వారిని బహిష్కరించాలని, క్రైస్తవుల స్థానంలో హిందువులను స్థిరపరచడం ఆపాలని' వారు నినదించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే సియాటిల్ సెంటర్ ఆర్మరిలో జరిగిన ఈ దీపావళి వేడుక నుంచి వారిని బయటకు పంపించారు. అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ప్రమిలా జయపాల్ ఇది జాతి వివక్ష అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ అహంకార ప్రదర్శన తనను తీవ్రంగా బాధించిందని, దీపావళి ఒక ముఖ్యమైన పండుగ అని, సురక్షిత వాతావరణంలో దానిని జరుపుకునే హక్కు సమాజానికి ఉందని ఆమె అన్నారు.

మాజీ వైట్ హౌస్ సలహాదారు అజయ్ జైన్ భూటోరియా కూడా దీనిని ఖండించారు. జాతి వివక్ష వ్యాఖ్యలు, కుట్ర సిద్ధాంతాల ద్వారా అమెరికా హిందువులు, భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. ముఖ్యంగా, మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ ఓటమికి భారతీయులే కారణమని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారని, అందువల్లే ఈ నిరసన జరుగుతోందని ఆయన తెలిపారు.

భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన వారిలో ఒకరిగా ట్రంప్ మద్దతుదారు జాక్ లాంగ్‌ను గుర్తించారు. గతంలో ఆయన వైట్ రీప్లేస్‌మెంట్ సంస్థను నడుపుతున్న సమయంలో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించారు. 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేసిన వారిలో జాక్ లాంగ్ కూడా ఒకరు.  జైలులో గడిపిన తర్వాత ఆయన క్షమాభిక్ష ద్వారా బయటకు వచ్చారు.  అప్పటి నుంచి వలసదారులు, ముస్లింలు, ఇతర వర్గాలకు వ్యతిరేకంగా ఆయన నిరసనల్లో పాల్గొంటున్నారు.

 

I am beyond disgusted by this vile and racist display. Diwali is an important holiday and our community should feel safe to celebrate it. This hateful display has no place in our city or this country.

— Rep. Pramila Jayapal (@RepJayapal) November 8, 2026

 

అమెరికాలోని హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ "కోయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా" ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలు ప్రదర్శన ఇస్తున్న సమయంలో జాక్ లాంగ్, ఇద్దరు నిరసనకారులు ఇలా భయాందోళనకు గురి చేయడం సరికాదని అన్నారు. భారతీయులకు వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లు ప్రదర్శించారని ఆ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న హిందువులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆ సంస్థ కోరింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Donald Trump
World News
Festivals
Telugu News