• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /ఏపీ రాజకీయంలో సంచలనం.. నవంబర్ 11న విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సంచలన ప్రకటన.. అసలు కారణాలు ఇవే!

ఏపీ రాజకీయంలో సంచలనం.. నవంబర్ 11న విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సంచలన ప్రకటన.. అసలు కారణాలు ఇవే!

వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11వ తేదీన ఆవిర్భావ దినోత్సవానికి ప్రజలందరినీ ఆయన ఆహ్వానించారు. కొత్త పార్టీ ఎందుకు?, కొత్త రాజకీయం ఎందుకు? అనే ప్రశ్నలకు ఆయన స్పష్టత ఇచ్చారు. జెన్‌జీ రాజకీయం ఎవరి కోసమో వివరించారు. రెండు ఫ్యాక్షన్ల నుంచి ప్రజలను రక్షించుకోవడానికి, రైతులను పేదలను బతికించుకోవడానికి తాను సరికొత్త పార్టీతో ముందుకు రాబోతున్నట్లు తెలిపారు.

Written ByRenuka Godugu
Published: Nov 08, 2026, 06:46 PM IST|Updated: Nov 08, 2026, 06:52 PM IST
joinshare
ఏపీ రాజకీయంలో సంచలనం.. నవంబర్ 11న విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సంచలన ప్రకటన.. అసలు కారణాలు ఇవే!
Image Credit: Vijayasai Reddy New Political Party Launch

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
ఏపీ రాజకీయంలో సంచలనం.. నవంబర్ 11న విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సంచలన ప్రకటన.. అసలు కారణాలు ఇవే!

ఏపీ రాజకీయంలో సంచలనం.. నవంబర్ 11న విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సంచలన ప్రకటన.. అసలు కారణాలు ఇవే!

2

సదర్ సంబరాలకు భాగ్యనగరం ముస్తాబు.. కేరళ బాహుబలి దున్నపోతుతో రచ్చ.. పూర్తి వివరాలు!

3

ఇంట్లో ఇత్తడి తాబేలును ఎందుకు ఉంచాలి? ధన ప్రాప్తికి, విజయానికి 5 శక్తివంతమైన కారణాలు ఇవే!

4

ఖాతాదారులు బీ అలర్ట్.. నవంబర్ 9 నుంచి 15 మధ్య 6 రోజులు బ్యాంకులు పనిచేయవు.. కారణం ఇదే!

5

దీపావళి ముహూరత్ ట్రేడింగ్‌లో నిరాశ.. 2017 తర్వాత తొలిసారి నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vijayasai Reddy New Political Party Launch: విజయసాయి రెడ్డి అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఆయన నూతన పార్టీ, దాని విధివిధానాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మొదట పార్టీ పెడతానని చెప్పి, ఆ తర్వాత పెట్టకపోవడంతో, పార్టీ పెడతారా? లేదా? అనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. అయితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తనను అణగదొక్కారని, తీవ్రంగా కించపరిచారని, అవమానించారని రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి మీడియా సమావేశంలో కొంత బాధతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి తనను పెద్ద ఎత్తున ప్రోత్సహించారని, గౌరవ మర్యాదలు ఇచ్చారని, కానీ వైఎస్సార్‌సీపీలో అవి తనకు అందలేదని, అవమానాలు ఎక్కువయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆ బాధ నేపథ్యంలోనే ఆయన త్వరలో పార్టీ పెడతారన్న విషయం ప్రజలకు ఇప్పటికే తెలిసిన పరిస్థితి ఉంది. విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకోవడం వెనుక పెద్ద రాజకీయ ఉద్దేశమే ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన రాజకీయ పార్టీ ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు.

ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని ఆయన ఒక పాంఫ్లెట్ విడుదల చేశారు. ఆ ఆహ్వాన పత్రిక బయటకు రావడంతో, విజయసాయి రెడ్డి పార్టీ పెట్టడం ఖాయమని ఒక్కసారిగా అందరికీ స్పష్టమైంది. ఈ సందర్భంగా ఉక్కు సంకల్పంతో, ఇనుప కండరాలతో, ప్రజా సంకల్పంతో కొత్త రాజకీయ ప్రమాణంలో భాగస్వాములు కావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలంటే కొత్త రాజకీయ పార్టీ అవసరమని ఆయన ప్రజలకు తెలిపారు. యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యమని కూడా ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో నామినేషన్లు వేయనీయకుండా ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నారని, అధికారంలో ఉన్నవారు సమాజాన్ని దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. కులాలు, మతాల పేరుతో రాజకీయాలు కాకుండా, ప్రజల సమస్యలే ప్రధాన అజెండాగా కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీకి పునాదులు పడ్డాయని, మరో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ కుటుంబాల ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా, కోటిన్నర కుటుంబాలు గౌరవంగా జీవించాలనే లక్ష్యంతోనే తన కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. విజయసాయి రెడ్డి పార్టీ స్థాపన వెనుక ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. మొదటిది, టీడీపీ, వైఎస్సార్‌సీపీ వంటి ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచన. ఆయన పోస్టులో కూడా ఇదే భావన వ్యక్తమయ్యేలా ఉంది. రెండోది, రెండు రాజకీయ కుటుంబాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, రాజకీయాల్లో ఆ కుటుంబాల ఆధిపత్యాన్ని తగ్గించి సామాన్యులకు అవకాశాలు కల్పించాలన్నదే ఆయన విడుదల చేసిన పోస్టర్‌లో ప్రధానంగా పేర్కొన్న విషయం. మూడోది, రైతులు, యువత, పేదలపై దృష్టి పెట్టి, రైతుల సమస్యలు, నిరుద్యోగం, యువతకు రాజకీయ ప్రాధాన్యత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని అజెండాగా చూపిస్తూ ఆయన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు తెలిపారు.

అయితే విజయసాయి రెడ్డి వ్యక్తిగత రాజకీయ ఉద్దేశమే ఇందులో ఉందా అని నిర్ధారించేందుకు ఆయన అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఆయన స్వయంగా చేసిన ప్రకటనలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మూడో అతిపెద్ద రాజకీయ పార్టీని, ప్రత్యామ్నాయ పార్టీని నిర్మించడం కోసం ఆయన కృషి చేస్తానని, ఆ ఉద్దేశం ఏమిటో 11వ తేదీన 11:11 నిమిషాలకు ప్రజలకు తెలియజేస్తానని చెబుతున్నట్లు కనిపిస్తోంది.

ఒకవైపు టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు ప్రత్యామ్నాయంగా ఈ రెండు పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ఒక శూన్యత ఏర్పడిందని ఆయన కొద్ది రోజులుగా మీడియా ముఖంగా చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అందులో ఉన్నప్పుడు తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని ఆయన గతంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం కేంద్రంతో సమన్వయం చేసుకుంటానని కూడా విజయసాయి రెడ్డి చెబుతున్నారు. సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అన్ని వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ నూతన పార్టీని స్థాపిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.

Read Also: వైసీపీ అభ్యర్థి ఓటమితో రోజా కంటతడి..ఆ వెంటనే కోపంతో కార్యకర్త చెంపదెబ్బ కొట్టేసింది!
 

విజయసాయి రెడ్డి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే, వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఏర్పరచుకోవాలనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు దూరంగా ఉన్న ఓటర్లను కొత్త వేదికపైకి తీసుకురావడం, యువత, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలను రాజకీయంగా సమీకరించి నూతన పార్టీకి బలమైన మద్దతుదారులుగా మార్చుకోవాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే నవంబర్ 11వ తేదీని వేదికగా ఎంచుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించనున్నారు. అయితే పార్టీ పేరు, జెండా, అజెండా వంటి వివరాలను ఆ రోజే వేదికపై పూర్తిగా ప్రకటిస్తానని ఆయన తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
Politics
YCP
Telugu News