SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చిన్న ఉప్పు చిట్కాతో మీ తలరాతే మారిపోతుంది.. వాస్తు ప్రకారం రోజూ చేతులకు ఉప్పు రాసుకోవడం వల్ల కలిగే 5 అద్భుతాలు!

ఉప్పును కూరల్లో వేసుకోవడం మాత్రమే కాదు.. దీంతో వాస్తు ప్రకారం కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇంట్లో నెగిటివిటీని కూడా తొలగిస్తుంది. అయితే, ప్రతిరోజూ మన చేతిని ఉప్పుతో రుద్దడం వల్ల కలిగే 5 వాస్తు ప్రయోజనాలు ఏంటి?

Written By Renuka Godugu
Published: Nov 19, 2026, 11:57 IST | Updated: Nov 19, 2026, 12:00 IST
Image Credit: 5 Astonishing Benefits Of Rubbing Salt:
Join

5 Astonishing Benefits Of Rubbing Salt: వాస్తు ప్రకారం కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా ఇంట్లో నెగిటివిటీని తగ్గించడానికి నీటిలో ఉప్పు వేసి తుడుస్తాం. స్నానం చేసే నీటిలో కూడా ఉప్పు వేస్తారు. అయితే, వాస్తు ప్రకారం ప్రతిరోజూ మన అరచేతిలో ఉప్పు వేసి రుద్దడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పాజిటివిటీని పెంచుతుంది. ఇలా చేయడం వల్ల టెన్షన్‌ కూడా తగ్గుతుంది. ఆర్థిక సమస్యలకు చెక్‌ పెడుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో సుకఃసంతోషాలు కూడా వెల్లువిరుస్తాయి. అయితే, అరచేతిలో ఉప్పుతో రుద్దడం వల్ల కూడా ప్రయోజనాలు లభిస్తాయి.

ఆర్థిక సమస్యలకు చెక్‌..
సాధారణంగా ఉప్పును శుక్రడు, రాహు గ్రహం శాంతించడానికి వాడతారు. వాస్తు నిపుణుల ప్రకారం చేతిలో ఉప్పు వేసుకుని రబ్‌ చేసుకోవాలి. ఇది మన జీవితంలో ఉన్న ఒడిదుడుకులను తగ్గిస్తుంది. అనవసర ఖర్చులు కూడా తగ్గిస్తుంది. దీంతో ఆర్థికంగా ఎదుగుదలకు కూడా సూచన ఇస్తుంది.

స్ట్రెస్‌ తగ్గుతుంది..
వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుతో ఈ రెమిడీ చేయడం వల్ల స్ట్రెస్‌ కూడా తగ్గుతుంది.  మన చుట్టూ ఉన్న నెగిటివిటీ కూడా తగ్గుతుంది. రాహు, శని చెడు దృష్టిని కూడా తగ్గిస్తుంది. మన శరీరంలో శక్తిని కూడా సమతులం చేస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

సమస్యలకు చెక్‌..
చాలామంది ఎంత కష్టపడినా సరైన ఫలితాలు లభించవు. ఇది ఎనర్జీ బ్లాకేజీ అంటారు. ఇలాంటి వారు చేతుల్లో ఉప్పు వేసుకుని రబ్‌ చేయాలి. పని ప్రదేశంలో కూడా ఉన్న సమస్యలకు కూడా చెక్‌ పెడుతుంది. మీ జీవితంలో ఆకస్మిక మార్పులు కూడా చూస్తారు. సమాజంలో మంచి గౌరవం కూడా లభిస్తుంది.

రాహు, కేతు ఎఫెక్ట్‌..
ఉప్పు వాస్తు ప్రకారం నెగిటివిటీ ఎఫెక్ట్‌ను తగ్గిస్తుంది. రాహు, కేతు నెగిటివ్‌ ఎఫెక్ట్‌కు చెక్‌ పడుతుంది. ఇంట్లో సుకఃసంతోషాలు కూడా వెల్లివిరుస్తాయి.

Read Also: ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!
Read Also: ఇంట్లో ఇత్తడి తాబేలును ఎందుకు ఉంచాలి? ధన ప్రాప్తికి, విజయానికి 5 శక్తివంతమైన కారణాలు ఇవే!

నెగిటివ్‌ ఎనర్జీ..
సాధారణంగా ఉప్పు ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీని తగ్గిస్తుంది. అందుకే స్నానం చేసే నీటిలో కూడా ఉప్పు వేసుకుని స్నానం చేస్తారు. ప్రతిరోజూ ఉప్పు అరచేతిలో వేసుకుని రబ్‌ చేసుకున్నా పాటిజివిటీ పెరుగుతుంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES