SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఇంట్లో అద్దాన్ని ఈ 5 దిశల్లో పెడితే డబ్బుకు లోటే ఉండదు.. మీ ఇంటి వాస్తు ఎలా ఉందో చెక్ చేసుకోండి!

Vastu Tips in Telugu: వాస్తు ప్రకారం ఇంట్లోని వస్తువులను అమర్చుకోవడమే కాకుండా, ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మనం చూసుకునే ముఖం చూడటం కోసం ఉపయోగించే అద్దాన్ని కూడా వాస్తు నియమాల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో వివరంగా తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 15, 2026, 20:50 IST | Updated: Nov 16, 2026, 11:11 IST
Image Credit: Mirrors at Home Best Directions
Join

Vastu Tips: ఇంట్లో అద్దం అనేది మనం రోజూ ఎన్నోసార్లు ముఖం చూసుకునే వస్తువు. ఈ నేపథ్యంలోనే దీనిని కూడా వాస్తు ప్రకారం సరైన స్థానంలో ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా ఏర్పాటు చేసిన అద్దం పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఉత్సాహాన్ని, ప్రశాంతతను నింపే శక్తిని కలిగి ఉండాలి. అప్పుడే సుఖశాంతులు ఇంట్లో వెల్లివిరుస్తాయి. ఇప్పుడు వాస్తు నిపుణుల సూచనల ప్రకారం అద్దాన్ని ఏ దిశలో ఏర్పాటు చేసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

అద్దం అభివృద్ధికి ప్రతీకగా భావిస్తారు. అందువల్లనే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మంచి శక్తిని ప్రసరింపజేస్తుంది. అయితే, సానుకూల శక్తి ప్రవహించే ప్రదేశంలోనే అద్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలా చేస్తే ఇంట్లో ఉండేవారికి సుఖసంతోషాలు కలుగుతాయి. ఉత్తర లేదా తూర్పు దిశలో అద్దాన్ని ఉంచడం శుభప్రదమని చెబుతారు. దక్షిణ లేదా పడమర దిశలో ఏర్పాటు చేసుకోకూడదు, ఎందుకంటే అది ప్రతికూల ప్రకంపనలకు దారితీస్తుంది. ఇంట్లో సమతుల్యత కూడా దెబ్బతింటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, మంచం కనిపించే విధంగా అద్దాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. సాధారణంగా అద్దంలో మంచంపై పడుకున్న వ్యక్తి ప్రతిబింబం కనిపించకూడదు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని, ఇంట్లో ఒత్తిడి పెరుగుతుందని, దంపతుల మధ్య వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు.

అలాగే, ఇంట్లో అద్దాన్ని అమర్చేటప్పుడు ప్రధాన ద్వారం అద్దంలో కనిపించేలా పెట్టకూడదు. ఇది కూడా వాస్తు శాస్త్రంలో నిషిద్ధంగా భావిస్తారు. అద్దం ఎప్పుడూ సానుకూల శక్తిని ప్రసరింపజేసే విధంగా ఉండాలి. ప్రధాన ద్వారానికి అతి దగ్గరగా కూడా అద్దాన్ని పెట్టకుండా ఉండడం మంచిది.
వాస్తు శాస్త్రం ప్రకారం, అద్దం ఏర్పాటు చేసుకునే సమయంలో టాయిలెట్లు కనిపించేలా కూడా ఉంచకూడదు. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.

ఇంకా, పగిలిన అద్దంలో మన ముఖాన్ని చూసుకోకూడదని వాస్తు నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. అలాంటి అద్దాలను ఇంట్లో ఉంచుకోకూడదు. పగిలిన అద్దాలు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయని నమ్ముతారు. కాబట్టి, సుఖసంతోషాలు, సానుకూల శక్తి ఇంట్లో నిలవాలంటే మంచి అద్దాన్ని సరైన దిశలో ఏర్పాటు చేసుకోవడం అవసరం. అద్దాన్ని సరిగ్గా అమర్చండి, ఇంట్లో శుభం కలగనివ్వండి.

(Disclaimer:  ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Read Also: ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!
Read Also: ఇంట్లో ఇత్తడి తాబేలును ఎందుకు ఉంచాలి? ధన ప్రాప్తికి, విజయానికి 5 శక్తివంతమైన కారణాలు ఇవే!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES