• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /భాయ్ దూజ్ రోజున చిత్రగుప్తుడినే ఎందుకు పూజిస్తారు? పూర్తి వివరాలు ఇవే!

భాయ్ దూజ్ రోజున చిత్రగుప్తుడినే ఎందుకు పూజిస్తారు? పూర్తి వివరాలు ఇవే!

Bhai Dooj 2026: భాయ్ దూజ్ పండకి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే, ఈ రోజు నార్త్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా చిత్రగుప్తుడిని పూజిస్తారు. అయితే, ఈ రోజు ఆయనను మాత్రమే పూజించడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 11, 2026, 10:47 AM IST|Updated: Nov 11, 2026, 10:47 AM IST
joinshare
భాయ్ దూజ్ రోజున చిత్రగుప్తుడినే ఎందుకు పూజిస్తారు? పూర్తి వివరాలు ఇవే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
ప్రధాని పదవి అడ్డుకోవడంపై సోనియా తీవ్ర మనస్థాపం..

ప్రధాని పదవి అడ్డుకోవడంపై సోనియా తీవ్ర మనస్థాపం..

2

Mother Dairy Milk Price Hike: మదర్ డెయిరీ పాల ధరల పెంపు.. లీటర్‌పై రూ.4 వరకు భారం.. కొత్త ధరలు ఇవే..!

3

నా కళ్లలో కళ్లు పెట్టి చూసే ధైర్యం మోడీకి లేదు.. ఆత్మకథలో సోనియా సంచలనం..

4

సోనియా ఆత్మ కథపై రచ్చ రచ్చ.. ఇటలీలో పుట్టి.. భారత్‌కు కోడలుగా సాగిన ప్రస్థానం..

5

మార్కెట్‌లోకి Infinix, Tecno కొత్త 5G ఫోన్లు.. ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bhai Dooj 2026: దీపావళి పండగ తర్వాత వచ్చే కార్తిక శుక్ల ద్వితీయ తిథి రోజున దేశవ్యాప్తంగా భాయ్ దూజ్ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.. ఈ పండగను అన్నాచెల్లెళ్ల పండగగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే.. ఇదే తిథిన మానవుల పాపపుణ్యాల చిట్టాను లెక్కపెట్టే చిత్రగుప్తుడిని పూజించే విశిష్ట సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది.. ముఖ్యంగా ఈ పండగను నార్త్‌లోని వ్యాపారులు, విద్యార్థులు అత్యంత నిష్ఠతో జరుపుకుంటారు. అయితే, తోబుట్టువుల పండుగ రోజే చిత్రగుప్తుడిని ఎందుకు ఆరాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం.. సమస్త ప్రాణికోటి కర్మలను లెక్కపెట్టే.. బ్రహ్మదేవుని శరీరం నుంచి చిత్రగుప్తుడు పుట్టారని అందరూ నమ్ముతూ ఉంటారు. యమధర్మరాజు దగ్గర ప్రధాన న్యాయ నిర్ణేతగా.. జీవుల కర్మలను లెక్కించేందుకు చిత్రగుప్తుడికి బాధ్యతలు అప్పగించబడ్డాయి. కార్తిక శుక్ల ద్వితీయ రోజు యమధర్మరాజు తన సోదరి యమున ఇంటికి వెళ్లి.. ఆతిథ్యం స్వీకరించారని.. అదే రోజున ఆయన సహాయం చేసే చిత్రగుప్తుడికి కూడా విశేష పూజలు నిర్వహించే సంప్రదాయం ఉందని పురాణాలు చెబుతున్నాయి.

చిత్రగుప్త పూజలో అత్యంత ప్రధాన వస్తువుల్లో పెన్ను, సిరాబుడ్డిలు, తెల్ల కాగితాలతో పాటు ఖాతా పుస్తకాలుగా చెప్పుకుంటారు. నార్త్‌లో వీటిన్నింటిని పెట్టుకుని పూజిస్తారట.. చిత్రగుప్తుడు రాతకు, విజ్ఞానానికి, న్యాయమైన లెక్కలకు అధిపతి కావడంతో విద్యార్థులు తమ పుస్తకాలతో పాటు వ్యాపారులు నూతన ఖాతా పుస్తకాలను ఆయన పాదాల వద్ద ఉంచి పూజిస్తారు.

ఈ రోజు ఉదయాన్నే చిత్రగుప్తుడి ప్రతిమను ప్రతిష్ఠిస్తారట.. పూజ చేసే సమయంలో తప్పకుండా కొత్త పెన్‌తో పాటు ఖాతా పుస్తకాలు పెట్టి.. పూలు, నైవేద్యాలను సమర్పిస్తారు. అంతేకాకుండా ఓం శ్రీ చిత్రగుప్తాయ నమం.. అంటూ ధూపదీపాలతో ఆరతి ఇచ్చి.. తమ కర్మలు సన్మార్గంలో నడిచేలా జ్ఞానం, సద్బుద్ధిని ప్రసాదించమని భక్తులు ప్రార్థిస్తారట..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News