Sonia Gandhi Book Controversy: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆత్మకథలో కీలక అంశాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వ్యక్తిగత జీవితం, రాజీవ్ గాంధితో ప్రేమ, పెళ్లి.. గాంధీ కుటుంబంతో అనుబంధం, పాలిటిక్స్ సహా పలు అంశాలు ఆత్మకథలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలకు విడుదలకు ముందే లీకులు ఒదిలారు. తన ఆత్మకథను Belonging - A journey of life పేరుతో ఆత్మకథను పుస్తక రూపంలో రిలీజ్ చేయబోతున్నారు. పుస్తకం విడుదల చేసే ముందుగా సోషల్ మీడియాలో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు. సోనియాగాంధీ 80 ఇయర్స్‌లో తన ఆత్మకథలో కీలక అంశాలను పంచుకున్నారు. ఇటలీ నుంచి వచ్చిన ఒక సాధారణ మహిళ, రాజకీయాలంటేనే ఇష్టంలేని ఆమె, ఇందిరా గాంధీ ఇంట్లో ఉంటూనే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న వ్యక్తి.. చివరికి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బుక్ పై కాంట్రవర్సీ..
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తన ఆత్మకథ Belonging: A Journey of Love పుస్తకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ పుస్తకం కాదని, పూర్తిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుస్తకమని ఆమె స్పష్టం చేసినా అందులో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు పొలిటికల్‌గా హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా బాబ్రీ మసీదు కూల్చివేత తనను కలిచివేసిందని ఆవేధన వ్యక్తం చేశారు. అదే సమయంలో బీజేపీ నేతలు కశ్మర్‌లో పండితులను ఊచకోత కోసినపుడు.. బంగ్లాదేశ్‌లో హిందువులను చంపినపుడు మీకు కన్నీళ్లు రాలేదని అని సోషల్ మీడియా వేదికగా సోనియా గాంధీ తీరును ఎండగడుతున్నారు.
వ్యక్తిగత జీవితంలో అనుభవాలు..
మరోవైపు సోనియా.. తన వ్యక్తిగత జీవితంలోని అనుభవాలు, కుటుంబంతో ఉన్న అనుబంధం, ప్రేమ, విధేయత వంటి అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. భర్త రాజీవ్ గాంధీ హత్యతో విషాదంలో మునిగిపోయినట్టు సోనియా గాంధీ ఆసక్తికర విషయాన్ని ఆత్మకథలో పంచుకున్నారు. భర్త చనిపోయిన తర్వాత.. భారత్ నుంచి సొంత దేశం ఇటలీ వెళ్లి పోయే తన మనసులు అంగీకరించలేని విషయాన్ని ప్రస్తావించారు. తన సోదరి ఇటలీ వచ్చేయాలని సూచించినప్పటికీ.. ఇల్లు, పిల్లలు బాధ్యతను గుర్తుచేసుకుని భావోద్వేగానికిలోనయిన విషయాన్ని ప్రస్తావించారు. భారతదేశాన్ని వీడి వెళ్లేందుకు మనసు అంగీకరించలేక పోయిందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. రాజీవ్ హత్యకు ముందు ఆయనకు ముప్పుపొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలను గుర్తించినట్లు తాను తర్వాత తెలుసుకున్నానని సోనియా తెలిపారు. ఈ హత్య వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు ఇప్పటికీ వెలుగులోకి రాలేదన్నారు. . ఇకపైనా అసలు నిజం బయటపడుతుందని కూడా తాను అనుకోవట్లేదనే అభిప్రాయం వ్యక్తంచేశారు.
అమితాబ్ ఫ్యామిలీతో అనుబంధం..
2016లో వారణాసిలో జరిగిన కాంగ్రెస్ రోడ్‌షో లో తీవ్ర అలసట, అనారోగ్యంతో తాను స్పృహతప్పిన వేళ.. కంటిముందు దివంగత భర్త రాజీవ్ గాంధీ రూపం కనిపించిందని సోనియా గాంధీ తన పుస్తకంలో ఉద్వేగభరితంగా ప్రస్తావించారు. రాజీవ్ గాంధీతో తన ప్రేమను ఆత్మకథలో వివరించారు సోనియా గాంధీ. 19 ఏళ్ల యువతి ఒక భారతీయ విద్యార్థిని కలవడంతో తన జీవిత ప్రయాణం ప్రారంభమైందని సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో విద్యార్థిగా చదువుకుంటున్న రోజల్లో 1965లో రాజీవ్ గాంధీతో తొలి పరిచయం, ఆపై ప్రేమకు దారితీసిన పరిస్థితిని సోనియా గాంధీ మనసులో మాట ఆత్మకథలో పంచుకున్నారు. భారతదేశానికి కోడలిగా వెళ్లడంపై ఇటలీలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు మొదట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని ఆత్మకథ పుస్తకంలో వెల్లడించారు.ఇటలీనుంచి భారత్ వచ్చిన రోజుల్లో ఇక్కడి సంస్కృతికి అలవాటుపడిన తీరు, వంటకాలను అలవాటు చేసుకోవడం, హిందీ భాషను నేర్చుకున్న విషయాన్ని సోనియా గాంధీ ఆత్మకథలో ప్రస్తావించారు. భారతదేశానికి వచ్చిన కొత్తలో హిందీ భాషను నేర్చుకోవడంలో అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయా బచ్చన్ తనకు సహాయం చేశారని సోనియా గుర్తుచేసుకున్నారు. అలాగే ప్రారంభంలో పచ్చిమిర్చి, కొత్తిమీర వంటి ఘాటైన భారతీయ మసాలా వంటకాలను తినడానికి ఇబ్బంది పడినప్పటికీ, కాలక్రమేణా భారతీయ జీవన విధానానికి ఎలా అలవాటు పడ్డారోనని ఆత్మకథలో ఆత్మీయంగా వివరించారు.