• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Vijayawada kanaka durga Temple: కనక దుర్గమ్మ దర్శనాలకు పొటెత్తిన భక్తులు.. తొలిరోజే ఏర్పాట్లపై ఆగ్రహం..

Vijayawada kanaka durga Temple: కనక దుర్గమ్మ దర్శనాలకు పొటెత్తిన భక్తులు.. తొలిరోజే ఏర్పాట్లపై ఆగ్రహం..

Heavy rush in indrakeeladri: ఈరోజు నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు పది రోజుల పాటు కనకదుర్గమ్మ పది రకాల అలంకారాల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అయతే.. తొలిరోజే విజయవాడకు భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్ భారీగా పెరిగిపోయింది.

Written ByInamdar Paresh
Published: Oct 11, 2026, 12:24 PM IST|Updated: Oct 11, 2026, 01:52 PM IST
joinshare
Vijayawada kanaka durga Temple: కనక దుర్గమ్మ దర్శనాలకు పొటెత్తిన భక్తులు.. తొలిరోజే ఏర్పాట్లపై ఆగ్రహం..
Image Credit: vijayawada durga temple

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Flipkart Sale Thomson TV: దసరా బంపర్ ఆఫర్.. 4K QLED స్మార్ట్ టీవీ కేవలం రూ.11,999 ధరకే!

Flipkart Sale Thomson TV: దసరా బంపర్ ఆఫర్.. 4K QLED స్మార్ట్ టీవీ కేవలం రూ.11,999 ధరకే!

2

Prabhas vs Rajamouli: ప్రభాస్ వర్సెస్ రాజమౌళి.. ఇద్దరు పాన్ ఇండియా దిగ్గజాల బిగ్ క్లాష్?

3

Hyderabad: బొల్లారంలో దారుణం.. కిడ్నాప్ కు గురైన ఐదేళ్ల బాలిక దారుణ హత్య.. నీటి సంపులో రాయికి కట్టేసి..

4

Telangana Temperature Hike: ఈ ఏడాదిలో 7 నెలల పాటు వేసవి కాలం..పగటిపూట మండిపోతున్న ఎండలు..ఎల్లో అలర్ట్ జారీ!

5

Chiranjeevi: చిరంజీవి ఒక్క ఫోన్ కాల్‌తో సెన్సార్ సమస్యలు పరిష్కారమవుతాయా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Huge rush in Vijayawada indrakeeladri temple: దేశ వ్యాప్తంగా దుర్గశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనక దుర్గమ్మతల్లిని దర్శించుకునేందుకు  చుట్టుపక్కల వారు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా భారీగా తరలి వస్తారు.ఈ క్రమంలో దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా తొలిరోజు ఇంద్రకీలద్రిపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది.  

 

విజయవాడ: దసరా ఉత్సవాల తొలిరోజే భక్తులకు మొదలైన అవస్థలు. మూడు లైన్లలో ఉచిత దర్శనం అంటూ డబ్బాలు కొట్టిన అధికారులు. వీఐపీలు, ప్రోటోకాల్ దర్శనాలకు పెద్దపీట. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడుతున్న భక్తులు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తుల ఆగ్రహం. #CBNJungleRaj #SaveTemplesFromTDP #AndhraPradesh #JaganannaConnects

— Jagananna Connects (@JaganannaCNCTS) October 11, 2026

 

ఈ రోజు నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు పది రోజుల పాటు కనకదుర్గమ్మ పది రకాల విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో అన్ని రకాల స్పెషల్ టికెట్లు రద్దు చేశారు.

 సామాన్య భక్తులకు దర్శనాలు అయ్యేలా దుర్గమ్మ గుడి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజైన  ఈరోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముఖ్యంగా దుర్గమ్మ గుడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు.

తొలిరోజే భక్తుల అవస్థలు..

విజయవాడలో తొలిరోజే భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు.  మూడు లైన్లలో ఉచిత దర్శనం, సామాన్యులకే పెద్దపీట అంటూ  అధికారులు ప్రచారం  చేశారని... కానీ వీఐపీలు, ప్రోటోకాల్ దర్శనాలకు పెద్దపీట వేస్తున్నారంటూ భక్తులు తీవ్ర విమర్శలు  చేశారు. 

గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడినట్లు తమ గొడును చెప్పుకున్నారు. అసలు ఎవరు భక్తులకు సరైన రెస్పాన్స్ ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Vijayawada
Festivals