• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Telangana Temperature Hike: ఈ ఏడాదిలో 7 నెలల పాటు వేసవి కాలం..పగటిపూట మండిపోతున్న ఎండలు..ఎల్లో అలర్ట్ జారీ!

Telangana Temperature Hike: ఈ ఏడాదిలో 7 నెలల పాటు వేసవి కాలం..పగటిపూట మండిపోతున్న ఎండలు..ఎల్లో అలర్ట్ జారీ!

Telangana Temperature Hikes: అక్టోబర్ నెల పూర్తి కావొస్తున్న తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలాన్ని తలపించేలా భానుడి ప్రతాపం కనిపిస్తోంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదు కావడం, గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోవడంతో పగటిపూట నిప్పుల కొలిమిని, రాత్రిపూట తీవ్రమైన ఉక్కపోతను ప్రజలు ఎదుర్కొంటున్నారు. రానున్న మూడు రోజుల్లో వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Written ByHarish Darla
Published: Oct 11, 2026, 01:03 PM IST|Updated: Oct 11, 2026, 01:06 PM IST
joinshare
Telangana Temperature Hike: ఈ ఏడాదిలో 7 నెలల పాటు వేసవి కాలం..పగటిపూట మండిపోతున్న ఎండలు..ఎల్లో అలర్ట్ జారీ!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Flipkart Sale Thomson TV: దసరా బంపర్ ఆఫర్.. 4K QLED స్మార్ట్ టీవీ కేవలం రూ.11,999 ధరకే!

Flipkart Sale Thomson TV: దసరా బంపర్ ఆఫర్.. 4K QLED స్మార్ట్ టీవీ కేవలం రూ.11,999 ధరకే!

2

Prabhas vs Rajamouli: ప్రభాస్ వర్సెస్ రాజమౌళి.. ఇద్దరు పాన్ ఇండియా దిగ్గజాల బిగ్ క్లాష్?

3

Hyderabad: బొల్లారంలో దారుణం.. కిడ్నాప్ కు గురైన ఐదేళ్ల బాలిక దారుణ హత్య.. నీటి సంపులో రాయికి కట్టేసి..

4

Telangana Temperature Hike: ఈ ఏడాదిలో 7 నెలల పాటు వేసవి కాలం..పగటిపూట మండిపోతున్న ఎండలు..ఎల్లో అలర్ట్ జారీ!

5

Chiranjeevi: చిరంజీవి ఒక్క ఫోన్ కాల్‌తో సెన్సార్ సమస్యలు పరిష్కారమవుతాయా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Temperature Hikes: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా ఈ సమయంలో వాతావరణం చల్లబడాల్సి ఉండగా, ప్రస్తుతం రెండో వేసవి కాలాన్ని తలపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో  పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగి భానుడి తీవ్రతకు వీధులు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. కేవలం పగలే కాకుండా రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత తీవ్రమవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మైదాన ప్రాంతాల్లో పెరిగిన గాలి కాలుష్యం కూడా ఈ వేడి తీవ్రత పెరగడానికి ఒక కారణమని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు

పడిపోయిన తేమ శాతం, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల వేడి తీవ్రత మరింతగా పెరిగింది. శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుండి 3 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా గాలిలో ఉండాల్సిన తేమ శాతం 60% నుండి 70% మధ్య ఉండాల్సి ఉండగా, పలు ప్రాంతాల్లో అది 50% కంటే తక్కువకు పడిపోయింది.

హైదరాబాద్‌లో శుక్రవారం రోజున తేమ శాతం 49 శాతానికి పడిపోగా, రామగుండంలో 42%, నిజామాబాద్.. నల్గొండల్లో 45%, హనుమకొండలో 49%, మహబూబ్‌నగర్‌లో 51% చొప్పున నమోదయ్యాయి.

వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్..
మరో ఒకటి లేదా రెండు రోజుల్లో తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించే సూచనలు ఉన్నాయి. రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, నిర్మల్‌, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జగిత్యాల, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ తీవ్ర వేడి పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
Telugu News
Weather Update