SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మీ జీతం, పొదుపు గురించి ఈ 5 రహస్యాలు ఎవరికీ చెప్పకండి.. అప్పుడే మీరు ధనవంతులవుతారు!

ఆచార్య చాణక్యుడు మనిషి ఎలా ఉండాలి? మాత్రమే కాదు.. సంసార జీవితం, ఆర్థిక సలహాలు సూచనలు కూడా చేశారు. చాణక్యనీతిలో ఆర్థిక క్రమశిక్షణ గురించిన కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. పొరపాటున కూడా ఇతరులకు మనం చెప్పకూడని 5 ఆర్థిక రహస్యాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 13, 2026, 10:11 AM IST | Updated: Nov 13, 2026, 10:16 AM IST
Image Credit: Chanakya Niti:
Join

Chanakya Niti: డబ్బు మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందే. దీనివల్లే ఇంట్లో కూడా లేనిపోని గొడవలు. సంబంధాల్లో చీలికలు.  చాలామంది తమకు వచ్చిన జీతాన్ని ఇతరులతో పోల్చుకుంటారు. ఒక వేళ మీరు పెద్ద ఎత్తున డబ్బులు ఆదా చేస్తున్నారని తెలిసినా వారు కూడా మనీ సేవ్‌ చేయడానికి లోన్‌ తీసుకోవచ్చు. చాలా వరకు తెలిసినవారే కదా అని బంధువులకు, స్నేహితులకు ఆదాయం, బ్యాంక్‌ ఖాతా, భవిష్యత్తు ఆర్థిక ప్లాన్స్‌ గురించి షేర్‌ చేసుకుంటూ ఉంటారు. వారు కూడా తమ నుంచి ఏమీ దాచకుండా ఉంటారేమో అని పొరబడతారు. కానీ, పొరపాటను కూడా ఈ 5 ఆర్థిక రహస్యాలు షేర్‌ చేయకూడదు.

ముఖ్యంగా ఆచార్య చాణక్య నుంచి ఈ ఆర్థిక రహస్యాలు తెలుసుకోవచ్చు. ఆయన మనకు కొన్ని సూచనలు చేశారు. ప్రధానంగా డబ్బును ఆదా చేసుకోవడం. సరిగ్గా వాడటం. వీటి గురించి మీరూ తెలుసుకోండి. మీరు చేస్తున్న పొదుపును సీక్రెట్‌గా దాచండి. అప్పుడే మీరు కూడా ధనవంతులు అవుతారు.

మీ ఆదాయం ఎప్పుడూ వ్యక్తిగతంలా ఉండేలా జాగ్రత్త పడండి. ఎవ్వరికీ కూడా మీ జీతం ఎంత? అనే విషయాలు షేర్‌ చేయకూడదు. అప్పుడు వారు మీ జీతంతో వారు పోల్చుకుంటూ ఉంటారు.  కొంతమందికి ఈ సీక్రెట్‌ తెలిస్తే అసూయ కూడా పడవచ్చు. ఒక వేళ మీకు వారికంటే ఎక్కువ జీతం ఉంటే ఇదే జరుగుతుంది.  ఒక వేళ మీకు తక్కువ జీతం వచ్చినా, మిమ్మల్ని చిన్న చూపు చూడవచ్చు.

మీ డబ్బు ఎలా దాచుతున్నారనేది కూడా ఎవరికీ షేర్‌ చేయకండి. ఎంత కష్టపడి మీరు ఈ డబ్బు పొందుతున్నారు. కాబట్టి దాని సంబంధించిన సీక్రెట్స్‌ ఇతరులతో చెప్పకూడదు. ఒక వేళ మీరు బ్యాంకులో డబ్బు దాచుకున్నారని తెలిస్తే వారి అవసరాల కోసం మిమ్మల్ని డబ్బు రుణంగా కూడా అడిగే అవకాశం ఉంది. ఇవ్వకపోతే సమస్యే. అందుకే కేవలం మీ కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ కూడా మీ బ్యాంక్‌ బ్యాలన్స్‌ వివరాలు షేర్‌ చేయకూడదు.

ఒక వేళ మీరు కారు లేదా ఇంటి రుణం తీసుకుంటే కూడా పర్సనల్‌గా ఉంచండి. వాటి వివరాలు చెప్పకండి. మీరు ఎంత రుణం తీసుకున్నారనే సీక్రెట్‌ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ఈఎంఐ కడుతున్నారు? మీ దగ్గర ఎంత ఉంది? అని అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. నమ్మకమైన ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌, బ్యాంక్‌ వారికి మాత్రమే సరైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

కంపెనీ నుంచి బోనస్‌ వచ్చినా కూడా ఎవరికీ చెప్పకండి. పాత పెట్టుబడుటు, మీ అదనపు ఆదాయం గురించిన వివరాలు కూడా ఎవరికీ షేర్‌ చేయకూడదు. మీ ఆదాయం పెరిగిందని వారికి తెలిస్తే కూడా మీ వద్ద నుంచి వారు డబ్బు ఆశించే అవకాశం కూడా ఉంది. వారికి డబ్బు అవసరం కూడా ఉండి మిమ్మల్ని అడగవచ్చు.

Read Also: ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!
Read Also: ఇంట్లో ఇత్తడి తాబేలును ఎందుకు ఉంచాలి? ధన ప్రాప్తికి, విజయానికి 5 శక్తివంతమైన కారణాలు ఇవే!

కొత్త ఇంటిని కొనుగోలు చేయాలన్నా.. బిజినెస్‌ ప్రారంభించినా, ఎక్కడైనా డబ్బులు పెట్టుబడి పెట్టాలన్నా ఎవ్వరికీ ఆ సీక్రెట్‌ చెప్పకండి. చాలామంది సూచనలు చేయడంతో ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక గందరగోళానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. అందరూ మీ మంచి కోరి సరైన సలహాలు ఇస్తారనే గ్యారెంటీ కూడా లేదు. కేవలం నిపుణుల సూచన, నమ్మకమైన వ్యక్తుల సూచనలు మాత్రమే తీసుకోండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES