• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /స్కూటర్‌లో దాక్కున్న భారీ కొండచిలువ.. స్టార్ట్ చేయబోతే ఊహించని షాక్!

స్కూటర్‌లో దాక్కున్న భారీ కొండచిలువ.. స్టార్ట్ చేయబోతే ఊహించని షాక్!

Python Found Inside Scooter In Bihar Video: ఓ స్కూటర్‌లో అత్యంత ప్రమాదకరమైన కొండచిలువ దూరింది.. అయితే, వెంటనే అటవీ శాఖ సిబ్బంది చేరుకుని.. దానిని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 13, 2026, 10:47 AM IST|Updated: Nov 13, 2026, 10:49 AM IST
joinshare
స్కూటర్‌లో దాక్కున్న భారీ కొండచిలువ.. స్టార్ట్ చేయబోతే ఊహించని షాక్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
India Vs New Zealand Highlights: టీమిండియా చెత్త బ్యాటింగ్.. మొదటి ఓవర్లోనే ముగ్గురు డకౌట్..!

India Vs New Zealand Highlights: టీమిండియా చెత్త బ్యాటింగ్.. మొదటి ఓవర్లోనే ముగ్గురు డకౌట్..!

2

వామ్మె.. ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక్కసారిగా చిరుత ఎంట్రీ.. ఏం చేశారో చూడండి!

3

స్కూటర్‌లో దాక్కున్న భారీ కొండచిలువ.. స్టార్ట్ చేయబోతే ఊహించని షాక్!

4

Vijayawada Digital Arrest: 'డిజిటల్ అరెస్ట్' పేరుతో విజయవాడలో భారీ దోపిడీ.. బెదిరించి రూ.10 కోట్లు కొట్టేశారు!

5

పిల్లల కోసం ప్రత్యేకం.. సినిమా టికెట్‌పై రూ.100 తగ్గింపు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Python Found Inside Scooter In Bihar Video: రోజు ఎప్పటి లాగే బయటికి వెళ్లేందుకు స్కూటర్‌ తీయబోయిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది.. తన స్కూటర్‌లో ఏదో సౌండ్‌ వినిపించడంతో అనుమానం వచ్చి.. ఎంటని చూడగా.. అందులో ఏకంగా మూడు అడుగుల పొడవున్న భారీ కొండచిలువ పడుకుని.. ఉండటం చూసి ఒక్కసారిగా షాక్‌ అయిపోయాడట.. ఈ ఘటన బిహార్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది.. అయితే, దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి తన స్కూటర్‌ను ఇంటి ముందే పార్క్ చేసి ఉంచాడు.. బయటకు వెళ్లేందుకు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా.. స్కూటర్ లోపలి భాగం నుంచి సౌండ్‌ రావడాన్ని గమనించాడు.. ఇంజన్ భాగంలో సమస్య వచ్చిందనుకున్నాడు.. ముందు జాగ్రత్తగా ఆ స్కూటర్‌ను సమీపంలోని ఓ మెకానిక్ షెడ్డుకు తీసుకెళ్లాడు..

అక్కడ మెకానిక్ స్కూటర్ ముందు భాగాన్ని విప్పి చూడగా.. లోపల చుట్టుకుని ఉన్న మూడు అడుగుల కొండచిలువ కనిపిందట.. దానిని చూడగానే.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారట.. కొండచిలువ ఇంజన్ వైర్ల మధ్య చిక్కుకుని ఉండటంతో దానిని బయటకు తీయడానికి నానా అవస్థలు పడ్డట్లు తెలుస్తోంది..

సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి భారీగా చేరుకున్నారు.. కొండచిలువకు ఎలాంటి హాని చేయకుండా.. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.. అయితే, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం.. మెకానిక్ సహాయంతో స్కూటర్ విడిభాగాలను అత్యంత జాగ్రత్తగా తీసివేశారు.. అంతేకాకుండా దాదాపు అరగంట పాటు కష్టపడి అటవీ సిబ్బంది.. చాకచక్యంగా ఆ కొండచిలువను పట్టుకున్నారట.. సురక్షితంగా సంచిలోకి ఎక్కించి.. అనంతరం దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారట..

అయితే, వాతావరణంలో మార్పులతో పాటు చలి కాలంలో పాములు వెచ్చదనం కోసం పార్క్ చేసిన వాహనాల ఇంజన్లలోకి.. బూట్ స్పేస్‌లలోకి దూరుతాయని అటవీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా చెట్లతో పాటు పొదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కార్లు, స్కూటర్స్‌ పెట్టేవారు.. తిరిగి ప్రయాణం ప్రారంభించే ముందు ఒకసారి వాటి క్లియర్‌గా చెక్‌ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Viral News
Trending News
Telugu News