SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

డిసెంబర్‌లో ఈ 4 రాశులకు బంపర్ లాభాలు.. ఆర్థిక కష్టాలు దూరం.. ఉద్యోగంలో ప్రమోషన్లు!

December 2026 Horoscope: డిసెంబర్‌ నెల కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా కూడా చాలా లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 21, 2026, 09:50 IST | Updated: Nov 21, 2026, 09:51 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

December 2026 Horoscope: 2026 సంవత్సరం చివరి నెల త్వరలోనే ప్రారంభం కాబోతోంది.. ఏడాది చివరి నెలగా భావించే డిసెంబర్‌లో జ్యోతిష్య శాస్త్రం పరంగా అనేక గ్రహాలు మార్పులు చేర్పులు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన గ్రహాలు సంచారం చేస్తాయి. ఈ నెలలో శని మీన రాశిలో సంచార దశలో కొనసాగుతుండగా.. దేవగురువు బృహస్పతి వక్రగతిలో సంచారం చేయబోతోంది.. వీటికి తోడు ఛాయా గ్రహాలైన రాహువు, కేతువుల ప్రభావంతో పాటు సూర్యుడు, బుధుడు, శుక్రుడు కూడా రాశి సంచారం చేయబోతున్నాయి.. ఈ అరుదైన గ్రహ సంచారాల వల్ల ఐదు రాశుల వారికి డిసెంబర్ నెల అత్యంత శుభప్రదంగా మారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఈ సమయంలో ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగంలో అద్భుతమైన పదోన్నతులు, వ్యాపార విస్తరణ వంటి అంశాల్లో సానుకూల ఫలితాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు జ్యోతిష్యులు నాగరాజు శర్మ మాటల్లో తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మీన రాశి:
మీన రాశి వారికి డిసెంబర్ నెల అత్యంత కీలకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అదృష్టం తోడుండటం వల్ల అన్ని రంగాల్లో విజయాలు కూడా సాధించే ఛాన్స్‌లు ఉన్నాయి. రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దశమ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.

వృషభ రాశి:
ఈ రాశి వారికి ఏడాది చివరి నెలలో అదృష్టం పూర్తిగా కలిసి రాబోతున్నట్లు జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ముఖ్యంగా దీర్ఘాకలికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. వ్యాపారవేత్తలు వృత్తిపరమైన ప్రయాణాలు కూడా చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ నెల ఎంతో అనుకూలంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

తులా రాశి:
తులా రాశి వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో డిసెంబర్‌ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. గురు గ్రహ ప్రభావంతో ఆదాయ మార్గాలు కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా.. ప్రమోషన్, బోనస్ అందే సూచనలు తప్పకుండా కనిపిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు పెరిగి వ్యాపార విస్తరణలు కూడా సులభంగా జరుగుతాయి. వైవాహిక, కుటుంబ జీవితంలో శాంతి, సంతోషాలు కూడా రెట్టింపు అవుతాయి.

కుంభ రాశి:
కుంభ రాశి వారికి డిసెంబర్ నెల కొత్త ఆదాయాల పరంగా చాలా వరకు కలిసి రాబోతుంది.. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగులు చేసేవారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికావడంతో పాటు, వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుని భారీగా లాభాలు కూడా కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి..
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES