SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Dev Deepavali 2026: కార్తీక పౌర్ణమిని దేవ్ దీపావళి ఎందుకంటారు..?.. దీని వెనుకున్న అసలు స్టోరీ ఏమిటంటే..?..

Kartik Purnima: కార్తీక మాసంలో పౌర్ణమి అనేది అత్యంత శుభమైన రోజు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈరోజున శివ, కేశవుడ్ని భక్తితో కొలుచుకుంటే అన్ని రకాల సమస్యలు దూరమౌతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 23, 2026, 18:29 IST | Updated: Nov 23, 2026, 18:52 IST
Image Credit: Dev purnima pooja (file)
Join

Dev Deepavali date 2026 kartik Purnima tradition: దేశంలో ఎక్కడ చూసిన కార్తీక మాసప్రభావంతో ఆలయాలన్ని భక్తులతో కిట కిట లాడుతున్నాయి. కార్తీక మాసం నేపథ్యంలో ఆధ్యాత్మిక శోభ  ఉట్టిపడుతుంది.  భక్తులు బ్రాహ్మీ మూహుర్తాల్లో స్నానాలు చేసి, దీపాలు వెలిగించి శివ, కేశవుల్ని భక్తితో పూజించు కుంటున్నారు. అంతే కాకుండా ఈ నెల పాటు దీపారాధన, ఉసిరి దీప దానాలు, నదీస్నానాలు మొదలైనవి చేస్తున్నారు. అయితే మనం కార్తీక మాసంలోనే అత్యంత పవిత్రమైన రోజుగా పౌర్ణమిని చెబుతారు. మనం కార్తీక పౌర్ణమిని నవంబరు 24న మంగళ వారం రోజున జరుపుకుంటాం.  

ఈ రోజున 365 వత్తుల గుత్తీదీపంను వెలిగించాలి. యథా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి.   కార్తీక సోమవారం రోజున సాయంత్రం 8 గంటల 30 నిముషాలకు పౌర్ణమి గఢియలు ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ 24న రాత్రి 6. 12 నిముషాల వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి. నవంబరు 24న సూర్యోదయం వేళ పౌర్ణమి ఉండటంతో మనం కార్తీక పౌర్ణమిని మంగళవారం రోజున జరుపుకుంటాం.  కార్తీక పౌర్ణమినే దేవ్ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. దీని వెనుక ఒక పురాణాగాథ ఉంది.


త్రిపురాసురల సంహారం..

కార్తీక పౌర్ణమి రోజున పరమ శివుడు ఒకే బాణంతో తారకాసురుడి కుమారులైన ముగ్గురు కుమారులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి  రాక్షసులను సంహరించారు.  ఈ ముగ్గురు దానవులు కూడా బ్రహ్మదేవుడితో వరం పొంది  బంగారం,వెండి, రాగిలో మూడు నగరాల్ని నిర్మించుకుని ఆకాశంలో సంచరిస్తు దేవతల్ని, రుషుల్ని పీడించేవారు. వీరు ముగ్గురు కూడా ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు  మాత్రమే వీరికి మరణం సంభవించేలా వరం ఉంది. 

వీరు వెయ్యిళ్లకు ఒకసారి మాత్రమే ఈ విధంగా ఒకే సరళ రేఖ మీద వస్తారు. అయితే.. దేవతలను, రుషులు శివుడ్ని ప్రార్థించగా ఆయన దేవతల మొర ఆలకించి ఒకే బాణంతో త్రిపురాసురుల పుత్రులను సంహరిస్తాడు. త్రిపురాసురుల సంహారంతో దేవతలు, రుషులు,మనులు దీపాలు వెలిగించి పండగాలా జరుపుకుంటారు. ఆరోజున త్రిపురాసురుల సంహారానికి గుర్తుగా త్రిపురారి పౌర్ణమి లేదా దేవ్ దీపావళిని అనాదీగా జరుపుకుంటున్నాం. 

అందుకు కార్తీక పౌర్ణమిని దేవ్ దీపావళి అని పిలుస్తారు. చెడుపై మంచి సాధించిన విజయంకు గుర్తుగా దీపాలు వెలిగించి పండగలా జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున శివయ్య స్వయంగా కాశీ నగరంకు వస్తారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున అనాదీగా దేవ్ దీపావళిని ఇప్పటికి నిర్వహిస్తారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES