Devi Navratri dussehra durga puja remedies: దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో మనం అక్టోబరు 20న దసరా పండగను జరుపుకుంటాం. దసరా రోజున ఏ పనిచేసిన అది వెయ్యిరెట్లు శుభఫలితాలు ఇవ్వడంతో పాటు గొప్ప విజయాలు అందిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈక్రమంలో నవరాత్రుల్లో చివరి రోజైన విజయ దశమి రోజున కొన్ని పరిహరాలు చేయాలని పెద్దలు చెబుతున్నారు. పాండవులు ఇదే రోజున శమీ చెట్టుపైన ఉంచిన తమ ఆయుధాలతో కౌరవులపై యుద్దంకు వెళ్లి విజయం సాధించారని చెప్తారు.
శ్రీరాముడు రావణాసారుడ్ని కూడా ఇదే రోజున హతమార్చాడని చెబుతారు. దుర్గమ్మతల్లి మహిషాసురుడ్ని దశమి రోజున సంహరించడం వల్ల మనం విజయ దశమిగా జరుపుకుంటాం. చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా విజయ దశమిని అనాదీగా జరుపుకొవడం మనం ఆనవాయితీగా పాటిస్తు వస్తున్నాం. అయితే దసరా రోజున కొన్ని వస్తువులు ఇంటికి తీసుకొస్తే అత్యంత శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. దసరా రోజున దక్షిణావృత శంఖం, నారీకేళంను ఇంటికి తీసుకొనివస్తే అత్యంత శుభప్రదమని పెద్దలు చెబుతుంటారు
దక్షిణావృత శంఖం.. ఈ శంఖంలో సకల దేవతను నివాసం ఉంటారని, ఇదేక్కడైతే ఉంటుందో అక్కడ ధనంకు, సుఖ, సంపదలకు కొదువ ఉండదని పెద్దలు చెబుతుంటారు. ఈక్రమంలో దసరా పండగ రోజున ఇంటికి తప్పనిసరిగా దక్షిణావృత శంఖం తీసుకొని రావాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అదే విధంగా ఈరోజున చేసే పూజలు, వ్రతాలు వెయ్యి రెట్లు శుభఫలితాలను ఇస్తాయి.
ఏకాక్షర నారీకేళం.. సాక్షాత్తూ మహాలక్ష్మీ దేవి స్వరూపంగా ఏకాక్షి నారీకేళంను భావిస్తారు. నార్మల్ గా కొబ్బరికి మూడు కన్నులు ఉంటాయి. కానీ ఏకాక్షి నారీకేళంకు ఒకే కన్ను ఉంటుంది. ఇది చాలా అరుదుగా లభిస్తుంది. ఈ నారీకేళంను ఇంటికి తెచ్చుకుంటే అత్యంత శుభప్రదంగా చెప్తారు. ఈ నారీకేళం అమ్మవారు స్వరూపంగా భావించి ఇంటికి తెచ్చుకుని పూజించి లాకర్ లో లేదా డబ్బులు పెట్టే చోట పెడితే ఆ ఇంట్లో ధనంకు ఎప్పటికి లోటుండదని జ్యోతిష్య పండితులు అనాదీగా చెబుతుంటారు.
దసరా రోజున చేయాల్సిన పనులు..
దసరా రోజున శమీ చెట్టు ఆరాధన, పాలపిట్టను చూడటం తప్పకుండా చేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అమ్మవారిని యథా శక్తి ప్రకారం షోడషోపచారాలతో పూజించుకొవాలి. లలిత సహస్రనామా పారాయణం, దుర్గసప్తశతి మొదలైనవి పఠించాలని పండితులు చెబుతున్నారు.