Dhana trayodashi: ధనత్రయోదశి వేళ మరో అద్భుతం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు సొంతింటి కల సాకారం.!.
Dhantrayodashi lucky zodiac signs: మూడురోజుల పండగైన దీపావళికి రెండు రోజుల ముందు మనం ధనత్రయోదశిని జరుపు కుంటాం.ఈ సారి ధనత్రయోదశి రోజు అద్బుత యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉండనుంది.
Dhana trayodashi diwali shubh yog lucky zodiac signs: జ్యోతిష్య పండితుల ప్రకారం దీపావళి పండగ వేళ కొన్ని రాశులకు అనుకొని విధంగా ధనలాభం కల్గుతుంది. ముఖ్యంగా దీపావళి మూడు రోజుల పండగ వేళ మనం నవంబర్ 6న ధన త్రయోదశిని జరుపుకుంటాం.ఆ తర్వాత నరక చతుర్దశి, దీపావళి పండగల్ని జరుపుకుంటాం. శుక్రవారం రోజున ధనత్రయోదశి రోజున లక్ష్మీనారాయణయోగం, గజకేసరి యోగంల కలిసి రావడంను చాలా అరుదైనదిగా పండితులు చెబుతున్నారు. అందుకే దీని ప్రభావం అనేది ద్వాదశ రాశులపై ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి కొన్ని నెలలుగా ఆగిపోయిన అనేక సమస్యలు పరిష్కారమౌతాయి. ఆకస్మిక ధనలాభంతో పాటు జీవితంలో గొప్ప శుభాలు ప్రాప్తిస్తాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మేషం.. ఈ రాశుల వారికి ధన త్రయోదశి ప్రభావం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. రాబడి పెరుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు.
మిథునం.. ఈ రాశుల వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు లాభిస్తాయి. భార్య తరపున ఆస్తులు సొంతమౌతాయి. రాబడి పెరుగుతుంది. కొత్త ఇల్లు కలసాకారం అవుతుంది. మీవల్ల లాభాలు పొందిన వారు మరల మీకు సహయం చేస్తారు.
కన్య.. ఈ రాశుల వారికి రాదనుకున్న డబ్బులు తిరిగి లభిస్తాయి. రాజకీయాల్లో రాణిస్తారు. మొండి బకాయిలు వసులవుతాయి. కెరిర్ లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సొదరులతో సఖ్యత ఏర్పడుతుంది.
తుల..ఈ రాశుల వారికి ధన త్రయోదశి ప్రభావంతో సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఏన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఒక కొలిక్కివస్తాయి. పెళ్లి కానీ వారికి మంచి శుభవార్తలు వింటారు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఎట్టకేలకు వారి కల నెరవేరుతుంది. ( గమనిక - ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం,విశ్వాసాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. జీతెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)