SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అక్టోబర్‌లో ఒకే రోజు 4 శక్తివంతమైన రాజయోగాలు.. ఈ 3 రాశులవారికి అదృష్టం కలిసొస్తుందా?

Lucky Zodiac Signs October 2026: ఒకే రోజు నాలుగు శక్తివంతమైన యోగాలు ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. ముఖ్యంగా దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయి. అయితే, ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 12, 2026, 09:46 AM IST | Updated: Oct 12, 2026, 09:48 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Lucky Zodiac Signs October 2026: ప్రస్తుతం దేవి నవరాత్రులు నడుస్తున్నాయి.. మొదటి రోజు అక్టోబర్‌ 11వ తేది చాలా ప్రాముఖ్యతను కలిగి భావించవచ్చు. అలాగే అమ్మవారి నవరాత్రులు శుక్ల పక్ష ప్రతిపద తిథి రోజు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈ రోజు అనేక యోగాలు ఏర్పడ్డాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 17న.. సూర్యుడు కన్యారాశిని వదిలిపెట్టి.. తులారాశిలోకి సంచారం చేయబోతోంది.. శుక్ర, బుధ గ్రహాలతో కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగంతో పాటు బుధాదిత్య రాజయోగం, లక్ష్మీనారాయణ రాజయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి.  

దీంతో పాటు ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడుతుంది.. ఫలితంగా, 4 రాశుల వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు.. ఈ సమయంలో కొన్ని రాశులవారికి నిలిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అయితే, ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మకర రాశి: 
ఈ నాలుగు శక్తివంతమైన రాజయోగాల కారణంగా ముఖ్యంగా మకర రాశివారికి చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఉద్యోగాల్లో అద్బుతమైన మార్పులు రావడమే కాకుండా.. అద్భుతమైన బాధ్యతలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కష్టపడి పనులు చేసేవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అంకిత భావంతో పనులు చేసేవారికి బోలెడు లాభాలు చేకూరుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. ఆరోగ్య పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. జీవితం చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఆర్థికంగా దిమ్మతిరిగే ధన లాభాలు కూడా కలుగుతాయి.

సింహ రాశి: 
ఈ సింహ రాశివారికి కూడా సమాజంలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది. పనుల్లో అద్భుతమైన గుర్తింపు కూడా లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి అద్బుతమైన లాభాలు కూడా కలుగుతాయి. వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో కూడా అభివృద్ధి లభించే అవకాశాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. కొత్త పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.

మిథున రాశి:
మిథున రాశివారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. వీరికి ఉద్యోగాల పరంగా వస్తున్న దీర్ఘకాలిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా చాలా సానుకూలంగా మారుతాయి. అలానే పనుల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. ఎలాంటి పెట్టుబడులు పెట్టిన భారీ లాభాలు కలుగుతాయి. అయితే, వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో భాగంగా పెట్టుబడులు పెట్టే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

గమనిక..


 
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES