• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Bus Metro Pass Reconsideration: ఆర్టీసీ - మెట్రో పాస్‌ ధరలపై దిగొచ్చిన ప్రభుత్వం..ప్రయాణికుల ఫిర్యాదులతో డిప్యూటీ సీఎం పరిశీలన!

Bus Metro Pass Reconsideration: ఆర్టీసీ - మెట్రో పాస్‌ ధరలపై దిగొచ్చిన ప్రభుత్వం..ప్రయాణికుల ఫిర్యాదులతో డిప్యూటీ సీఎం పరిశీలన!

Telangana Bus Metro Pass News: ప్రజా రవాణాను సులభతరం చేసేందుకు ఇటీవల తీసుకొచ్చిన ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలు అధికంగా ఉన్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో, వాటిని పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజువారీ పాస్ ధర రూ. 400 కాగా, నెలవారీ పాస్ ధర రూ. 8,500 గా అమలులో ఉంది. అయితే ఈ ధరలు సామాన్య ప్రజలకు ఆర్థిక భారంగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవడంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

Written ByHarish Darla
Published: Oct 12, 2026, 12:46 PM IST|Updated: Oct 12, 2026, 12:51 PM IST
joinshare
Bus Metro Pass Reconsideration: ఆర్టీసీ - మెట్రో పాస్‌ ధరలపై దిగొచ్చిన ప్రభుత్వం..ప్రయాణికుల ఫిర్యాదులతో డిప్యూటీ సీఎం పరిశీలన!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'జీ తెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ & టీచర్స్ అవార్డ్స్ 2026– గురు వందనం'..

'జీ తెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ & టీచర్స్ అవార్డ్స్ 2026– గురు వందనం'..

2

AP Rythu Bazar Rice Price: ఏపీలో పేదలకు భారీ ఉపశమనం..రైతు బజార్లో రూ.49, రూ.50లకే సన్నబియ్యం పంపిణీ!

3

ప్రభుత్వ బడుల భవిష్యత్తు మారాలంటే GO 25 సవరించాల్సిందే.. 5,490 FLN పాఠశాలలపై టీచర్ల కీలక డిమాండ్..!!

4

1890ల నాటి తెలంగాణ ఆడపడుచులా ముస్తాబు.. గోచీ చీరలో బతుకమ్మ ఆడుతూ నెట్టింట వైరలైన యువతి!

5

Bus Metro Pass Reconsideration: ఆర్టీసీ - మెట్రో పాస్‌ ధరలపై దిగొచ్చిన ప్రభుత్వం..ప్రయాణికుల ఫిర్యాదులతో డిప్యూటీ సీఎం పరిశీలన!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Bus Metro Pass News: రాష్ట్రంలో రవాణా వ్యవస్థను అనుసంధానిస్తూ ప్రవేశపెట్టిన ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై ప్రజల నుండి వరుసగా ఫిర్యాదులు అందాయి. పాస్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవనే ఆందోళనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం యు-టర్న్ తీసుకుంది. 

వాస్తవ పరిస్థితులను, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కామన్ పాస్ ఛార్జీలను పునఃపరిశీలించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

అమల్లో ఉన్న కామన్ పాస్ ఛార్జీల వివరాలు..
ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చిన కామన్ పాస్ రుసుముల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. రోజువారీ కామన్ పాస్ (Daily Pass) దీని మొత్తం ధర రూ. 400 కాగా, ఇందులో మెట్రో వాటా రూ. 300 కాగా, ఆర్టీసీ వాటా రూ. 100 గా ఉంది.

నెలవారీ కామన్ పాస్ (Monthly Pass) విషయానికొస్తే దీని మొత్తం ధర రూ. 8,500 కాగా, ఇందులో మెట్రో వాటా రూ. 7,000, ఆర్టీసీ వాటా రూ. 1,500 గా నిర్ణయించారు. ఈ అధిక ఛార్జీలు రోజువారీ ప్రయాణికులకు తీవ్ర భారాన్ని కలిగిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది.

ఉన్నతాధికారుల సమావేశం.. 
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన సూచనల మేరకు, కామన్ పాస్ ఛార్జీలను పునఃపరిశీలించేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులతో త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 

ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఆర్టీసీ, మెట్రో సేవలను ప్రజలు గరిష్ఠంగా వినియోగించుకునేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరేలా, వారి అవసరాలకు అనుగుణంగా సరసమైన ధరలతో కామన్ పాస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News