• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /విమానాల్లో పవర్ బ్యాంకులు ఎందుకు పేలుతున్నాయి? అసలు కారణాలు ఇవే

విమానాల్లో పవర్ బ్యాంకులు ఎందుకు పేలుతున్నాయి? అసలు కారణాలు ఇవే

Power Bank Fire In Airplane: పవర్‌ బ్యాంకులు విమానాలు గాల్లో ఉన్నప్పుడే ఎందుకు పేలుతూ ఉంటాయో తెలుసా? అయితే, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. ముఖ్యంగా నిపుణులు ఏం చెబుతున్నారు? విమానాల్లో పవర్‌ బ్యాంకులు పెలడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 12, 2026, 12:01 PM IST|Updated: Oct 12, 2026, 12:02 PM IST
joinshare
విమానాల్లో పవర్ బ్యాంకులు ఎందుకు పేలుతున్నాయి? అసలు కారణాలు ఇవే
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Bus Metro Pass Reconsideration: ఆర్టీసీ - మెట్రో పాస్‌ ధరలపై దిగొచ్చిన ప్రభుత్వం..ప్రయాణికుల ఫిర్యాదులతో డిప్యూటీ సీఎం పరిశీలన!

Bus Metro Pass Reconsideration: ఆర్టీసీ - మెట్రో పాస్‌ ధరలపై దిగొచ్చిన ప్రభుత్వం..ప్రయాణికుల ఫిర్యాదులతో డిప్యూటీ సీఎం పరిశీలన!

2

దసరా తర్వాత ముంబైలో 8వ వేతన సంఘం కీలక సమావేశం..ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, బేసిక్ పేపై నిర్ణయం!

3

విమానాల్లో పవర్ బ్యాంకులు ఎందుకు పేలుతున్నాయి? అసలు కారణాలు ఇవే

4

Rupee Surges Vs Dollar: రూపాయికి రిజర్వ్ బ్యాంక్ ఊరట..ఆయిల్ డాలర్ల విండోతో కరెన్సీ నియంత్రణ చర్యలు

5

బరువు తగ్గాలనుకుంటున్నారా? మీ డైట్‌లో తప్పక ఉండాల్సిన 4 కూరగాయలు ఇవే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Power Bank Fire In Airplane:ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా వినియోగించే ప్రయాణికులకు పవర్ బ్యాంకులు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.. అయితే, ప్రస్తుతం విమాన ప్రయాణాల సమయంలో పవర్ బ్యాంకులు అకస్మాత్తుగా పేలిపోవడం లేదా వాటిల్లో నుంచి మంటలు చెలరేగడం వంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఇలా పవర్ బ్యాంకుల వల్లే ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి? దీనిపై ఏవియేషన్ నిపుణులు, శాస్త్రవేత్తలు ఏం అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా ఇప్పుడు మార్కెట్లో దొరికే పవర్ బ్యాంకులలో అధిక శక్తిని నిల్వ చేసే లిథియం, అయాన్ బ్యాటరీలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే, బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయినప్పుడు.. అది చల్లబడే వేగం కంటే వేడెక్కే వేగమే.. చాలా ఎక్కువగా ఉంటుందట.. దీనినే సాంకేతిక పరిభాషలో .. థర్మల్ రన్‌అవే (Thermal Runaway)గా పిలుస్తారట.. బ్యాటరీ లోపలి ఉష్ణోగ్రత నియంత్రణ పూర్తిగా కోల్పోయినప్పుడు తీవ్రమైన రసాయన చర్య జరడం కారణంగా.. స్వల్ప వ్యవధిలోనే బ్యాటరీ పేలిపోయి భారీగా మంటలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి..

అయితే.. విమానాలు వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో క్యాబిన్ లోపల.. బయట వాతావరణ పీడనంలో (Air Pressure) గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి.. భూమితో పోలిస్తే.. ఎత్తులో పీడనం తగ్గడం వల్ల లిథియంతో పాటు అయాన్ కణాల లోపలి వాయువులు ఊహించని స్థాయిలో విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల పవర్ బ్యాంకులు ఉబ్బిపోవడంతో పాటు డిజైన్‌ పూర్తి షేప్‌ అవుట్‌ అవుతూ ఉంటుంది.. నాణ్యత తక్కువగా ఉన్న లేదా పాతబడిన బ్యాటరీలు ఈ ఒత్తిడిని తట్టుకోలేక సులభంగా పేలిపోయే అవకాశాలు ఉన్నాయి..

మరో ప్రధానమైన కారణం ప్రయాణికుల అజాగ్రత్తగా భావించవచ్చు.. విమానాల్లోని ఓవర్‌హెడ్ బిన్స్‌లోని.. క్యాబిన్ లగేజీ బ్యాగులను అతిగా కుక్కడంతో పాటు బలంగా నెట్టడం వల్ల లోపల ఉన్న పవర్ బ్యాంకులపై ఊహించని స్థాయిలో ఒత్తిడి పడే అవకాశాలు ఉన్నాయి.. ఈ మెకానికల్ ఒత్తిడికి బ్యాటరీ ఇంటర్నల్ సర్క్యూట్లు దెబ్బతిని షార్ట్ సర్క్యూట్‌కు దారి తీసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే విమానం ఎక్కే.. కొద్దిసేపటి ముందే పవర్ బ్యాంకులను అధిక సమయం లేదా ఓవర్‌ఛార్జ్ చేయడం వల్ల కూడా బ్యాటరీ ఇప్పటికే వేడిగా ఉండి.. ప్రమాద తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..అందుకే విమాన సంస్థలు పవర్ బ్యాంకులను చెక్ ఇన్ బ్యాగేజీలో అల్లో చేయ్యకుండా.. కేవలం హ్యాండ్ లగేజీలోనే ఉంచుకోవాలని స్పష్టంగా చెబుతూ ఉంటారు. క్యాబిన్‌లో ప్రమాదం జరిగితే.. సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేసే అవకాశాలు ఉంటాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Tech News