SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

100 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో గజకేసరి రాజయోగం.. ఈ 7 రాశులకు బిగ్ జాక్‌పాట్, డబ్బే డబ్బు!

Gajakesari Yoga Effect On Zodiac: 100 ఏళ్ల తర్వాత దేవీ నవరాత్రుల్లో ఎంతో శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో తెలుసుకోండి.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Oct 01, 2026, 11:13 AM IST | Updated: Oct 01, 2026, 11:16 AM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Gajakesari Yoga Effect On Zodiac: అతి త్వరలోనే శారదీయ నవరాత్రులు, దుర్గాపూజ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే, ఈ సమయంలోనే దాదాపు 100 సంవత్సరాల తర్వాత దేవీ నవరాత్రుల సమయంలోనే దేవగురు బృహస్పతితో పాటు చంద్రుల ప్రత్యేక సంయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా ఈ సమయంలోనే ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు వెల్లడించారు. ఈ సమయంలో జీవితంలో సానుకూలమైన మార్పులు కూడా రాబోతున్నాయి.

గజకేసరి యోగం ప్రత్యేకత ఇదే..
ఎంతో శక్తివంతమైన గురు, చంద్రుల కలయిక కారణంగా ఏర్పడబోయే ఈ  గజకేసరి యోగం వల్ల ఆర్థికంగా బంపర్‌ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కీర్తి, ప్రతిష్టలు విపరీతంగా పెరగడమే కాకుండా సంపదతో పాటు అద్బుతమైన ఉన్నత పదవులు కూడా సొంతం చేసుకుంటారు. అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. అక్టోబర్‌ నెలలో దేవీ నవరాత్రుల్లో కొన్ని రాశులవారు బంపర్‌ లాభాలు పొందుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ వెల్లడించారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేషం (Aries): 
100 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్న గజకేసరి రాజయోగం ప్రభావంతో ఉద్యోగంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొత్త కొత్త బాధ్యతలు కూడా చాలా వరకు దక్కే సూచనలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.

వృషభం (Taurus): 
వృషభ రాశివారికి కూడా ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి మొండి బాకీల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా వస్తాయి. ఆర్థికంగా వస్తున్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే దాంపత్య జీవితం కూడా చాలా మధురంగా ఉంటుంది. అనేక రకాల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

మిథునం (Gemini): 
మిథున రాశివారికి కూడా ఊహించని ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి కూడా వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారు కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా సులభంగా పొందుతారు.

కర్కాటకం (Cancer):
కర్కాటక రాశివారికి కూడా ఈ యోగం ఎఫెక్ట్‌తో బంపర్‌ లాభాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. వీరికి సమాజంలో హోదాతో పాటు గౌరవం కూడా పెరుగుతాయి. పెళ్లికాని వారికి వివాహాలు కూడా కుదురుతాయి.

మకరం (Capricorn): 
మకర రాశివారికి కూడా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. తోబుట్టువుల సహకారం కూడా లభిస్తుంది. అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.

కుంభం (Aquarius):
కుంభ రాశివారికి కూడా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కెరీర్‌ పరంగా వస్తున్న అనేక సవాళ్లు కూడా లభిస్తాయి. భవిష్యత్ ఎదుగుదలకు కూడా విశేషమైన లాభాలు కలుగతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.

మీనం (Pisces): 
మీన రాశివారికి కూడా ఈ పవర్‌ఫుల్ యోగంతో అనేక రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఎన్నో రకాల సమస్యలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి.. పనులన్నీ సజావుగా సాగుతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES