SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అక్టోబర్ 31న గురు గ్రహ సంచారం.. ఈ 3 రాశుల వారికి బంపర్ లాభాలు, ఇక డబ్బే, డబ్బు!

Jupiter Transit: అక్టోబర్‌ 31వ తేదిన గురు గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అనుకున్న ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 29, 2026, 10:44 AM IST | Updated: Oct 29, 2026, 10:46 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Jupiter Transit Effect On Zodiac: అతిపెద్ద గ్రహాల్లో గురు గ్రహం కూడా ఒకటిగా పరిగణిస్తారు. ఈ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ గ్రహం రాశి సంచారం చేయబోతోంది. ముఖ్యంగా అక్టోబర్‌ 31వ తేదిన గురు గ్రహం సింహ రాశిలోకి ప్రవేశించబోతోంది. అయితే, ఈ సమయంలో కర్కాటక రాశిని వదిలి సింహ రాశికిలోకి వెళ్లడం విశేషం.. దీని కారణంగా కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేష రాశి
గురు గ్రహం ప్రభావంతో మేష రాశివారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. గురు గ్రహం ఈ రాశివారికి 5వ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా ఈ సమయంలో విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా విద్యా రంగానికి సంబంధించిన వారికి అనుకూలమైన ప్రయోజనాలు కూడా కలిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయులతో పాటు ప్రొఫెసర్లు, గైడ్‌లు, లైఫ్ కోచ్‌ల వంటి వృత్తులలో స్థిరపడిన వారికి కొత్త అవకాశాలు కూడా కలుగుతాయి. వివాహ కానీ వారికి ఈ సమయంలో బోలెడు లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారికి బంపర్‌ ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

వృషభ రాశి
గురు గ్రహం ఎఫెక్ట్‌తో వృషభ రాశివారికి కూడా ఎన్నో రకాల లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కుటుంబాల పరంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా కుటుంబంలో ప్రేమనురాగాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడితో పాటు డబ్బు సంపాదించే విషయంలో కూడా అద్భుతమైన ఛాన్స్‌లు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయం ఎంతో లాభదాయంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయంలో చదువుపై కూడా దృష్టి పెరుగుతుంది. పరిశోధనలు చేస్తున్నవారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మిథున రాశి
గురుబలం రెట్టింపు అవ్వడం వల్ల మిథున రాశివారికి కూడా అనేక రకాల లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. తోబుట్టువులతో సంబంధాలు మరింత మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీంతో పాటు పని ప్రదేశాల్లో అద్భుతమైన గుర్తింపు కూడా తప్పకుండా లభించబోతోంది..ముఖ్యంగా మీడియాతో పాటు మార్కెటింగ్‌ రంగాల్లో పనులు చేసేవారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలనుకునేవారికి ఎన్నో రకాల లాభాలు కూడా కలుగుతాయి. వ్యాపారాలు విస్తరించాలనుకునేవారికి సమస్యలు రాకుండా ఉంటాయి..
 

గమనిక..

 


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES